Saturday, July 27, 2024

ఎఫ్‌డీ చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్..

తప్పక చదవండి

ప్రముఖ ప్రైవేటు సెక్టార్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ తన ఎఫ్‌డీపై వడ్డీ రేట్లను సవరించింది. రూ. 2 కోట్ల లోపు ఉండే ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఈ కొత్త వడ్డీ రేటు అమలులో ఉంటుంది. 15 నెలల నుంచి 5 సంవత్సరాల కాలవ్యవధికి సాధారణ ప్రజలకు గరిష్టంగా 7.10%, సీనియర్ సిటిజన్లకు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధికి 7.75% రేట్లు ఫిక్స్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అత్యంత ప్రజాదరణ పొందిన పెట్టుబడి పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ). భద్రత, భరోసా, అధిక రాబడి ఇందులో ఉంటుంది కాబట్టి అందరూ ఈ ఎఫ్‌డీ ఖాతాలను ప్రారంభిస్తూ ఉంటారు. పోస్ట్ ఆఫీసుతో పాటు, బ్యాంకుల్లో కూడా ఈ ఎఫ్‌డీ ఖాతాలను ప్రారంభించవచ్చు. అయితే అన్ని చోట్ల వడ్డీ రేటు ఒకేలా ఉండదు. పోస్ట్ ఆఫీసులో ఒక వడ్డీ రేటు ఒక రకంగా ఉంటుంది. అలాగే బ్యాంకులను బట్టి కూడా వడ్డీ రేటు మారుతుంది. ఆర్బీఐ రెపో రేటు సవరించిన ప్రతిసారి వడ్డీరేట్లలో మార్పు కనిపిస్తుంది. అయితే ప్రముఖ ప్రైవేటు సెక్టార్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ తన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించింది. రూ. 2 కోట్ల లోపు ఉండే ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఈ కొత్త వడ్డీ రేటు అమలులో ఉంటుంది. 15 నెలల నుంచి 5 సంవత్సరాల కాలవ్యవధికి సాధారణ ప్రజలకు గరిష్టంగా 7.10%, సీనియర్ సిటిజన్లకు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధికి 7.75% రేట్లు ఫిక్స్ చేసింది. ఈ సవరణతో 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఎఫ్‌డీలపై ఇప్పుడు సాధారణ ప్రజలకు 3% నుంచి 7% వరకు సీనియర్ సిటిజన్‌లకు 3.5% నుంచి 7.75% వరకు వడ్డీ రేటు వస్తుంది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కొత్త ఎఫ్‌డీ రేట్లు సెప్టెంబర్ 18, 2023 నుండి అమలులోకి వచ్చాయి.
యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుతం 7 నుంచి 29 రోజులలోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3%, తదుపరి 30 నుంచి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే వాటిపై 3.50% వడ్డీ రేటును అందిస్తోంది. 46 రోజుల నుంచి 60 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 4.25%, 61 రోజుల నుంచి మూడు నెలల కాలవ్యవధితో స్థిర-కాల డిపాజిట్లపై 4.50% వడ్డీ రేటు ఇస్తోంది. మూడు నుంచి ఆరు నెలలలోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్‌లు 4.75% రేటును పొందుతాయి. ఆరు నుంచి తొమ్మిది నెలల్లో మెచ్యూర్ అయ్యేవి ఇప్పుడు 5.75% రేటును ఆర్జిస్తాయి. 9 నెలల నుంచి 1 సంవత్సరం వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ 6% వడ్డీ రేటును చెల్లిస్తుంది. 1 సంవత్సరం నుంచి 15 నెలల వరకు మెచ్యూర్ అయ్యే వాటిపై యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు 6.70% వడ్డీ రేటును చెల్లిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు 15 నెలల నుంచి 5 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 7.10% వడ్డీ రేటును చెల్లిస్తుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు