Friday, September 20, 2024
spot_img

అసాంఘిక కార్యకాలపాల నియంత్రణపై దృష్టి

తప్పక చదవండి
  • అక్రమ రవాణా కట్టడికి చెక్‌ పోస్ట్‌ల ఏర్పాటు
  • కమ్యూనిటీ పోలీసింగ్‌ ద్వారా అవగాహనా కార్యక్రమాలు
  • రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక పర్యవేక్షణ
  • చోరీ సొత్తు రికవరీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు
  • పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌
    ఖమ్మం :నిర్మానుష్య ప్రాంతాలను అడ్డాలుగా చేసుకొని అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని పోలీస్‌ కమిషనర్‌ విష్ణు యస్‌. వారియర్‌ పోలీస్‌ అధికారులకు ఆదేశించారు.శుక్రవారం పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హల్లో జరిగిన నేర సమీక్ష సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ..శాంతి భద్రతలను పరిరక్షిస్తూనే దొంగతనాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని,.. రాత్రి గస్తీ పెంచి అధికారుల పర్యవేక్షణ వుండాలని ఆదేశించారు.పాత నేరస్తుల కదలికలను కట్టడి చేస్తూ..దొంగతనాలకు చెక్‌ పెట్టేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని అన్నారు.కరుడుగట్టిన నేరస్తులపై పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. చోరి సోత్తు రికవరీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ భాధ్యతగా తీసుకొవాలని మాధకద్రవ్యాల సరఫరా మూలాలకు సంబంధించిన అన్ని అనుసంధానాలను గుర్తించి కట్టడి చేయడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలవుతుందని అన్నారు. ఇందుకు అధికారుల సమిష్టి కృషి, స్థానిక ప్రజల మధ్య సమన్వయం ఉండాలని అన్నారు. జిల్లా స్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలని అన్నారు.త ద్వారా గంజాయి వంటి మాదక ద్రవ్యాల రవాణాపై స్పష్టమైన సమాచారం అందుతుందన్నారు.జిల్లా వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారుల్లో జరుగుతున్న ప్రమాదాలపై విశ్లేషించి ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గించేందుకు దృష్టి సారించాలని అన్నారు.ప్రధానంగా ఖమ్మం రూరల్‌ ,కొణిజర్ల ,వైరా ప్రాంతాలలో వేగ నియంత్రికలు, సూచిక బోర్డుల ఏర్పాటు చేయడం , వివిధ గ్రామాలు, ప్రాంతాల నుంచి అనుసంధానం చేసే రోడ్లపై అవసరమైన చోట్ల వేగ నియంత్రికలు నిర్మించాలన్నారు.కమ్యూనిటీ పోలీసింగ్‌ లో భాగంగా సీసీ కెమెరాల ఆవశ్యకత,సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రతీ గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యమై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకుముందుకు వచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండ యువతకు మంచి సలహాలు సూచనలు ఇవ్వాలని సూచించారు. తీవ్రమైన నేరాలు, పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసుల దర్యాప్తుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని, అదేవిధంగా పెండిరగ్‌ ఉన్న ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్స్‌, పోస్టుమార్టం రిపోర్ట్స్‌, నేరస్తుల అరెస్టు చేయని కేసులలో నేరస్తులను అరెస్టు చేసి త్వరగా ఇన్వెస్టిగేషన్‌ పూర్తిచేసి చార్జిషీట్‌ దఖాలు చేయాలని సూచించారు.సమావేశంలో అడిషనల్‌ డీసీపీ కుమారస్వామి,అడిషనల్‌ డీసీపీ రామోజీ రమేష్‌, ట్రైనీ ఏఎస్పీ అవినాష్‌ కుమార్‌, ఏసిపీలు గణేష్‌ ,భస్వారెడ్డి, రహెమాన్‌, రామనుజం, ప్రసన్న కుమార్‌, రవి, వేంకటేశ్వర్లు,ఏఆర్‌ ఏసీపీ నర్సయ్య, పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు