Tuesday, October 15, 2024
spot_img

మహిళపై ఐదుగురు లైంగిక దాడి..

తప్పక చదవండి
  • వాస్తుదోషాలు సరిచేస్తామంటూ మభ్యపెట్టిన వైనం..

ముంబై : వాస్తు దోషాలు తొలగింపు సాకుతో ఐదుగురు వ్యక్తులు ఒక మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఐదేళ్లుగా జరుగుతున్న ఈ దారుణంపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో బాధిత మహిళ భర్త స్నేహితులైన ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. మహారాష్ట్రలోని పాల్ఘడ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 35 ఏండ్ల మహిళ భర్తకు దుష్టశక్తులు ఆవహించాయని, వారున్న ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని అతడి ఐదుగురు స్నేహితులు ఆమెను నమ్మించారు. ఆమె భర్తకు ఎలాంటి హాని జరుగకుండా ఉండేందుకు, ప్రభుత్వ ఉద్యోగ భద్రతతోపాటు ఆ ఇంట్లో శాంతి కోసం పలు పూజలు చేయాలని ఆమెను నమ్మించారు. 2018 ఏప్రిల్‌ నుంచి ఆ మహిళ ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ఇంటికి వెళ్లేవారు. పూజలు నిర్వహించి ‘పంచామృతం’ పేరుతో మత్తు మందు కలిపిన పానీయం తాగించేవారు. ఆ మహిళ మత్తులో ఉండగా అత్యాచారానికి పాల్పడేవారు.

2019లో థానేలోని యూర్ ఫారెస్ట్‌లో, కందివాలిలోని ప్రధాన నిందితుడి మఠంలో, లోనావాలాలోని రిసార్ట్‌లో కూడా ఆ మహిళపై ఆమె భర్త స్నేహితులు అత్యాచారం చేశారు. అలాగే పూజల కోసమంటూ రూ.2.1 లక్షల డబ్బుతోపాటు బంగారాన్ని ఆమె నుంచి తీసుకున్నారు. సెప్టెంబర్‌ 11న బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమె భర్త స్నేహితులైన రవీంద్ర భాటే, దిలీప్ గైక్వాడ్, గౌరవ్ సాల్వి, మహేంద్ర కుమావత్, గణేష్ కదమ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఐదుగురు కలిసి ఇదే తరహాలో ఇతర మహిళలపై లైంగిక దాడులకు పాల్పడి ఉంటారా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు