Saturday, May 18, 2024

చికెన్ కర్రీలో ఎలుక పిల్ల..

తప్పక చదవండి
  • ప్రముఖ హోటల్‌పై ఎఫ్‌డిఎ దాడులు..
  • హోటల్‌ల్లోని వంటగదులు చూసి అధికారులు షాక్..

ముంబై : హోటల్ లో ఫుడ్ ఇంటిలో వండే వంటల కంటే భిన్నంగా టెస్ట్ గా ఉంటాయని ఎక్కువమంది భావిస్తారు. ఎందుకంటే ఏ మాత్రం సమయం దొరికినా లేదా ఫ్యామిలీతో సరదాగా గడపాలన్న రెస్టారెంట్ కు వెళ్తారు. అక్కడ రకరకాల ఆహారాన్ని ఆస్వాదిస్తారు. అయితే ఇప్పుడు టేస్టీ ఫుడ్ కోసం హోటల్ కి వెళ్లాలంటే ఆలోచించే విధంగా ఒక సంఘటన చోటు చేసుకుంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని ఓ ప్రముఖ హోటల్‌లో నాన్ వెజ్ డిష్‌లో చనిపోయిన ఎలుక పిల్ల కనిపించడంతో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) అధికారులు అప్రమత్తమయ్యారు. ముంబైలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దాడులు ప్రారంభించింది. ముంబైలోని ప్రసిద్ధ హోటళ్లలో, రెస్టారెంట్లలో తినడానికి సాధారణ పౌరుల నుంచి వివిధ దేశాల నుంచి ముంబైలో అడుగు పెట్టిన వారు కూడా వెళ్తారు. అయితే ఇలాంటి హోటళ్లలోని వంటశాలలు అపరిశుభ్రంగా ఉంటాయని ఎవరూ ఊహించి ఉండరు. ఇటీవల ఓ జంట ముంబైలోని ప్రముఖ పాపా పంచో రెస్టారెంట్‌కి భోజనం కోసం వెళ్ళింది. రోటీ, చికెన్, మటన్ కర్రీలు ఉన్న ప్లేట్ ను ఆర్డర్ చేశాడు. తాము ఆర్డర్ చేసిన ఫుడ్ ని తింటూ ఉండగా ఒకతని చూపు చికెన్ ముక్క మీద పడింది. చికెన్ కర్రీలో మిగతా చికెన్ ముక్కలకంటే.. ఒక చికెన్ ముక్క భిన్నంగా ఉన్నట్లు గుర్తించాడు. బాగా పరిశీలించగా అది.. చికెన్ ముక్క కాదు.. చనిపోయిన ఎలుక పిల్ల అని గుర్తించారు. దీంతో దంపతులు తాము తింటున్న ఆహారాన్ని వదిలేసి వెంటనే బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ విషయం క్షణాల్లో ముంబై నగరంలో చక్కర్లు కొట్టింది. ఎఫ్‌డీఏ దృష్టికి చేరుకుంది. సీరియస్‌గా తీసుకున్న ఎఫ్‌డీఏ బృందం రంగంలోకి దిగింది. ముంబైలోని పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లపై ఇప్పుడు ఆ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఎఫ్‌డీఏ కేవలం హై-ఫై హోటళ్లపైనే కాదు చిన్న, పెద్ద హోటళ్లపై కూడా నిఘా ఉంచింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు