Friday, October 11, 2024
spot_img

ఏపీలో నకిలీ అధికారి పట్టుబడ్డాడు …

తప్పక చదవండి

ఏపీలోని విశాఖపట్నంలో పోలీసులు ఓ నకిలీ నేవీ అధికారిని అరెస్టు చేశారు. మార్కాపురానికి చెందిన సూర్య చలపతిరావు అలియాస్ శశికాంత్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నేవీ కమాండర్‌ పేరుతో నిరుద్యోగులను మోసగించారు. అతడిపై విశాఖ, విజయవాడలో నాలుగు కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.
నేవీ క్యాంటీన్‌ వద్ద అతడిని గుర్తించిన నేవీ అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో చలపతిరావును అరెస్టు చేసి అతడి వద్ద ఉన్నయూనిఫామ్‌, కారు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చలపతిరావు ఇప్పటి వరకు 15 మంది బాధితుల నుంచి రూ. 30 లక్షలు వసూలు చేశాడని పోలీసులు వెల్లడించారు. ఈజీ మనీ, జల్సాలకు అలవాటు పడి డబ్బు సంపాదించేందుకు ఇలాంటి దారి ఎంచుకున్నాడని వివరించారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు