Sunday, May 19, 2024

వికారాబాద్‌ జిల్లాకు ‘‘రెడ్‌ అలెర్ట్‌’’

తప్పక చదవండి
  • కోట్‌ పల్లి ప్రాజెక్ట్‌ను పరిశీలించిన ఐజీపీ షానవాజ్‌ ఖాసీం ఐపిఎస్‌
  • జిల్లాలోని అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
  • విపత్కర పరిస్థితుల్లో పర్యాటకులకు అనుమతి లేదని వెల్లడి
  • అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ పోలీస్‌ కంట్రోల్‌
    రూమ్‌ నంబర్‌ 8712670056
    వికారాబాద్‌ జిల్లా : భారీ వర్షాల కారణంగా పోలీసు అధికారులు అప్రమత్తం అయ్యారు.అత్యవసర పరిస్థితుల్లో పోలీస్‌ వారి సహాయం పొందాలని నిత్యం ప్రజలకు తెలియపరుస్తున్నారు.అందులో భాగంగా బుధవారం మల్టీ జోన్‌- II ఐజిపి షానవాజ్‌ ఖాసీం ఐపిఎస్‌ వికారాబాద్‌ జిల్లాలో పర్యటించి పోలీస్‌ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అధికారులకు సలహాలు,సూచనలు ఇచ్చారు. ఉదృతంగా ప్రవహిస్తున్నా నాగసముందర్‌ వాగును,కోట్‌ పల్లి ప్రాజెక్ట్‌ ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రాబోయే 48 గంటలలో మరింతగా భారీ వర్షాలు ఉన్నందున పోలీస్‌ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి, తమ పరిధి లోని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.భారీ వర్షాల సందర్బంగా పోలీస్‌ అధికారులు అందరూ తమ తమ పోలీస్‌ స్టేషన్‌ ల పరిధిలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి.పోలీస్‌ అధికారులు రెవెన్యూ, కలెక్టరేట్‌ ,ఇతర శాఖల అధికారుల తో అనుసంధానంలో ఉండి ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను తెలుసుకుంటూ ఉండాలి. తమ తమ పోలీస్‌ స్టేషన్‌ ల పరిధిలలో ఏమైనా అత్యవసరం వస్తే వెంటనే స్పందించడానికి అంబులెన్స్‌లు, డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి. భారీగా వర్షాలు కురుస్తున్నా కారణంగా జిల్లాలో వాగులు, ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి కావున పర్యటకులు ఎవ్వరుకూడా అనంతగిరి హీల్స్‌, కోట్‌ పల్లి మొదలగు పర్యాటక ప్రాంతాలకు రావద్దు అని ఆదేశించారు.పర్యటకానికి సంబందించిన ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు. దయచేసి ప్రజలు ఎవ్వరు కూడా ప్రమాదకరమైన వాగులు దాటే ప్రయత్నం చేయవద్దనీ సూచించారు.
    అత్యవసరం సమయంలో పోలీసుల సాయం పొందాలని ప్రజలకు సూచన…
    ఏమైనా అత్యవసరం ఉన్నట్లు అయితే డైల్‌ 100 కి గాని వికారాబాద్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ 8712670056 కి కాల్‌ చేయాలి.పోలీస్‌ అధికారులు అందరూ ప్రతి గ్రామ సర్పంచ్‌,సంబంధిత గ్రామ ప్రజలతో సమన్వయంగా వుండి ఎప్పటికప్పుడు వరద ఉధృతి గురించి సమాచారం తెలుసుకోవాలి. 24శ7 పోలీస్‌ అధికారులు సిబ్బంది విధినిర్వహణలో అప్రమత్తంగా ఉండి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటలు జరగకుండా జాగ్రతలు తీసుకోవాలని ఐజిపి సూచించారు.
    జిల్లా పోలీస్‌ అధికారులను అభినందించిన ఐజీపీ..
    మల్టీ జోన్‌-II ఐజిపి షానవాజ్‌ ఖాసీం ఐపిఎస్‌ జిల్లా పోలీస్‌ అధికారుల పనితీరును అభినందించడం జరిగింది. జిల్లాలో సిసిటివి ల ఏర్పాటు,ఎన్ఫోర్మెంట్‌,రోడ్డు ప్రమాదాలు,ఆత్మహత్యలు తగ్గుదలపైనా తీసుకుంటున్న చర్యలు, యూఐ కేసుల విషయం లో, ఇటీవల పలు ముఖ్యమైన కేసుల ఛేదనలో , భారీ వర్షాలలో వికారాబాద్‌ జిల్లా పోలీస్‌ అధికారుల పని తీరు, అభినందనీయం అని జిల్లా ఎస్‌పి కోటిరెడ్డి నీ, జిల్లా పోలీస్‌ అధికారులను, సిబ్బందిని ఐజిపి అభినందించడం జరిగింది. పోలీస్‌ అధికారులు అందరూ ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ మంచిగా పని చేసి పోలీస్‌ డిపార్ట్మెంట్‌ కు మంచి పేరు తీసుకొని రావాలని ఐజిపి తెలిపారు. ఐజిపి జిల్లా పోలీస్‌ కేంద్రం లోని రిసెప్షన్‌ కేంద్రాన్ని పరిశీలించి రికార్డు లు పరిశీలించారు. కార్యక్రమం లో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి,అదనపు ఎస్‌పి శ్రీనివాస్‌ రావు , డిటిసి అదనపు ఎస్‌పి మురళీధర్‌, వికారాబాద్‌ డిఎస్‌పి నర్సిములు, ఏఆర్‌ డిఎస్‌పి, డిసిఆర్‌బి ఇన్స్పెక్టర్‌ వెంకటేశం, వికారాబాద్‌ టౌన్‌ ఇన్స్పెక్టర్‌ టంగుటూరి శ్రీను, డిఎస్‌బి ఇన్స్పెక్టర్‌ డివిపి రాజు, ఎస్‌ఐ సంతోష్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు