Sunday, October 6, 2024
spot_img

ఖజానా దివాలా తీయడం వల్లే ముందస్తు మద్యం టెండర్లు

తప్పక చదవండి
  • భూములమ్మి, మద్యం సొమ్ముతో ఖజనాను నింపాలనుకుంటున్నారు)
  • పెద్దపల్లి మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ‘దిశ’ కంటే ఘోరం
  • 4గురు గ్యాంగ్ రేప్ చేశారని బాధిత బాలిక చెప్పినా చర్యలేవి?
  • దోషులను కఠినంగా శిక్షించేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు
  • తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనైపోయింది
  • అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్….
    పెద్దపల్లిలో బాలిక హత్య కేసును నీరుగార్చారని ఆరోపించారు. హత్యలు, అత్యాచారాల్లో బాధితులను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. బాలిక మృతిని ఆత్మహత్యగా తేల్చేశారని, ఇది దిశ కంటే దారుణమైన సంఘటన అన్నారు. బీఆర్ఎస్ మంత్రే కేసును మూసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాలిక కేసులో సీఎంవో నుండి పోలీసులపై ఒత్తిడి ఉందన్నారు. పెద్దపల్లి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫొటో జర్నలిస్టులందరికీ హ్రుదయ పూర్వక శుభాకాంక్షలు. వెయ్యి పదాలు చెప్పలేని భావాన్ని ఒక్క ఫొటో చెబుతుంది. సమాజంలో జరిగే మంచి చెడులకు సజీవ సాక్ష్యం ఫోటోలు… తీపి గుర్తులుగా మిగిలేవి ఫోటోలు. దేశంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ తన కంటితో ప్రపంచానికి చూపించే ఫోటో జర్నలిస్ట్ నిరంతర శ్రామికుడు. ఎన్నో శారీరక, మానసిక ఒత్తిళ్ళను తట్టుకుని ఎంతో కష్టపడి తీసిన ఫొటోలను ప్రపంచానికి చూపించే ఫొటో జర్నలిస్టు సేవలు నిజంగా మరువలేనివి. కేసీఆర్ పాలనలో దివాళా తీసిన తెలంగాణలో ఆదాయం కోసం భూములను తెగనమ్ముతున్నడు.. చివరకు గడువు ముగియక ముందే మద్యం టెండర్లు పిలిచి దరఖాస్తుల పేరుతోనే 2,400 కోట్ల రూపాయలు వసూలు చేసిండు.. ఇన్నేళ్లు ఎన్నికల హామీలను అమలు చేయని కేసీఆర్… ఎన్నికలొస్తున్నయని ఈ నాలుగు నెలల పాటు నమ్మించేందుకు హామీలను నెరవేరుస్తానంటడు… ఈ మూడు నెలలు ఫస్ట్ నాడే జీతాలిస్తడు… కొద్ది మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చి ఎన్నికలైనంక అందరికీ ఇస్తానని నమ్మబలుకుతాడు.. తెలంగాణ ప్రజలంతా వాస్తవాలను గమనించాలి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో డిపాజిట్లు కూడా రావు.. ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం… గతంలో అధికారమిస్తే పూర్తిగా అవినీతిమయం చేస్తే… కేసీఆర్ అధికారంలోకి వస్తే అవినీతితోపాటు తెలంగాణను పూర్తిగా అప్పుల ఊబిలో ముంచారు… కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిధులు ఎక్కడి నుండి తెస్తారు? అదే బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్రంలో అధికారంలో ఉండేది బీజేపీ యే కాబట్టి…. అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణను ఆదుకోవడంతోపాటు పేదలకు మేలు జరిగేలా సంక్షేమ పథకాలను అమలు చేసే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రజలకు మేలు చేస్తున్న సంక్షేమ పథకాలను తొలగించే ప్రసక్తే లేదు.. వాటిని అమలు చేయడంతోపాటు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తాం… కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కొత్త రేషన్ కార్డులను ఇవ్వకుండా పేదలకు తీవ్రమైన అన్యాయం చేస్తోంది. వారికి అందాల్సిన సంక్షేమ పథకాలను అందకుండా చేస్తున్నరు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు