Wednesday, October 9, 2024
spot_img

తగ్గనున్న వంటనూనెలు ధరలు..

తప్పక చదవండి
  • అంతర్జాతీయ చమురు ధరలు తగ్గాయి..
  • ఎడిబుల్ ఆయిల్ అసోషియేషన్ కు రిక్యూస్ట్ చేసిన కేంద్రం..
  • రూ. 8 నుంచి 12 వరకు తగ్గే అవకాశం..

న్యూ ఢిల్లీ : అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడంతో వంటనూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ ను కోరింది. ప్రస్తుతమున్న ధరలపై రూ.8 నుంచి రూ.12లు తగ్గించాలని నివేదించింది. తగ్గించిన ధరలను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని కోరింది. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ కొన్ని ప్రముఖ బ్రాండ్లు నూనె ధరలను తగ్గించడం లేదని, ఇతర బ్రాండ్ల లాగే ఆ బ్రాండ్లు కూడా ధరలను వెంటనే తగ్గించాలని కేంద్రం స్పష్టం చేసింది. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తో సహా ప్రధాన పరిశ్రమ సంస్థలతో జరిగిన సమావేశంలో ఖర్చు ప్రయోజనాలను తక్షణమే వినియోగదారులకు బదిలీ చేయాలని ఆహార, ప్రజా పంపిణీ శాఖ తెలిపింది. ఇతర బ్రాండ్ల కంటే ఎక్కువ ధరలను నిర్వహిస్తున్న కంపెనీలు తమ ధరలను తగ్గించాలని ప్రత్యేకంగా కోరింది. ధరల వివరాల సేకరణ, వంటనూనెల ప్యాకేజింగ్ వంటి అంశాలపైనా అధికారులు సమావేశంలో చర్చించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు