Wednesday, May 8, 2024

బలేశ్వర్ రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు సీబీఐకి అప్పగింత..

తప్పక చదవండి
  • వివరాలు వెల్లడించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్..
  • రైల్వే బోర్డు సిఫార్సు మేరకే ఈ నిర్ణయం..
  • ప్రమాద స్థలిలో సహాయ కార్యక్రమాలు పూర్తి..
  • పునరుద్ధరణ కార్యక్రమాలు వేగవంతం..
  • కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ను కావాలనే లూప్ లైన్ లోకి
    మార్చారని అనుమానాలు..

ఒడిశాలోని బాలేశ్వర్‌ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఈ దుర్ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయాలని రైల్వే బోర్డు సిఫారసు చేసిందని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన భువనేశ్వర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

ప్రమాద జరిగిన ప్రాంతంలో సహాయక కార్యక్రమాలు పూర్తయ్యాయని.. ఘటనా స్థలిలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. రైల్వే ట్రాక్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాయన్న మంత్రి.. ఓవర్‌ హెడ్‌ వైరింగ్‌ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. బాధితులకు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోందన్నారు. రైలు ప్రమాదంపై అశ్వినీ వైష్ణవ్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది మానవ తప్పిదమా..? లేక మరేదైనా కుట్ర కోణం దగుందా..? అన్న దానిపై సీబీఐ విచారణ జరుపుతుందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే బహనాగ స్టేషన్ మేనేజర్ ను కూడా అధికారులు విచారించారు. బహనాగ స్టేషన్ మాస్టర్ రూమ్, సిగ్నలింగ్ రూమ్ లో సీసీ కెమెరాలను పరిశీలించారు. మరోవైపు.. కోరమాండల్ ను కావాలనే లూప్ లైన్ లోకి మార్చారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టంలో ఎవరో మార్పులు చేశారని రైల్వేశాఖ మంత్రి చెప్పారు. సిగ్నలింగ్ వ్యవస్థపైనా సీబీఐ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తుందన్నారు. జూన్ 2వ తేదీ రాత్రి మూడు రైళ్లు ఢీకొట్టిన ఘటనలో ఇప్పటివరకూ 275 మంది మృతిచెందారు. 1100మందికి పైగా గాయపడ్డారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు