Friday, May 17, 2024

డ్రగ్స్ ఖిల్లాగా.. ఖమ్మం జిల్లా.. !

తప్పక చదవండి
  • కెపి చౌదరి ఖమ్మం లింకులన్నీ అక్కడివేనా.
  • హై సెక్యూరిటీ జోన్ ను షెల్టర్ జోన్ గా ఎలా మార్చారు.
  • నార్కోటిక్స్ బ్యూరో స్పెషల్ ఆపరేషన్ మొదలైందా..?
  • ఆదాబ్ కథనాలతో ప్రముఖులకు వెన్నులో వణకు..
  • కథ కంచికి చేరుతుందా..? ఒత్తిళ్లతో నీరుగారిపోతుందా..?

ఖమ్మం,
సంచలనం సృష్టించిన మాదక ద్రవ్యాల సరఫరా కేసులో పోలీసుల అదుపులో ఉన్న టాలీవుడ్ నిర్మాత కెపి చౌదరి వ్యవహారాలపై తెలంగాణా పోలీస్ దర్యాప్తు వేగం పెంచినట్లు తెలుస్తుంది… ఇప్పటికే రాష్ట్ర రాజధానిలో కలకలం రేపుతున్న డ్రగ్స్ మూలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వేళ్ళూనుకున్నాయని అధికారులు అవగాహనకొచ్చారు.. ఇప్పుడు ఈ దర్యాప్తు మొత్తాన్ని ఖమ్మం నగరంపై కేంద్రీకృతం చేసి మూలాలను పట్టుకొనేందుకు వివిధ కొణాలలో విచారణ ముమ్మరం చేశారని సమాచారం… పోలీసులకు పట్టుబడ్డ కెపి చౌదరి స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకల్ కావటం.. పాల్వంచలో గంజాయి వ్యాపారులతో సంబందాలు నెరపినట్లు వచ్చిన వార్తలు.. ఖమ్మం టు హైదరాబాద్ ప్రయాణం.. అక్కడి నుండి టాలీవుడ్ ప్రముఖుల పరిచయాలతో పాటు వివిధ దేశాల డ్రగ్ పెడ్లర్లతో ఆయనకున్న సంబందాలు ఒక్కోక్కటిగా ఆరా తీస్తూ.. అసలు లింక్ కోసం నార్కోటిక్స్ బ్యూరో అన్వేషణ కొనసాగిస్తోంది..

ఈ కోణంలోనే ఇప్పుడు ఖమ్మం జిల్లా డొంకను కదిలించే పనిలో పడ్డారు ఆ శాఖ అధికారులు… అయితే బోడేపూడి కృష్ణ ప్రసాద్ చౌదరికి జిల్లాలోని హైలెవల్ ప్రముఖులతో పాటు, జిల్లాలోని పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో కూడా అనేక సత్సంబందాలు ఉన్న నేపధ్యంలో ఇప్పుడు ఈ కేసుపై ప్రభుత్వం కూడా సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది… ఇప్పటికే ‘ఆదాబ్ హైదరాబాద్’ లో వచ్చిన కధనంతో పలువురు ప్రముఖుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది.. వ్యాపార పరంగానే కాకుండా సినీ పరిశ్రమ వ్యక్తిగా ఏర్పడిన సంబందాలు ఇప్పుడు తమను ఏ ఇరకాటంలో నెడతాయోననే భయం ఖమ్మం ప్రముఖులలో నెలకొంది.. బోనకల్ రోడ్ లోని ఓ హై సెక్యూరిటీ గేటెడ్ కమ్మూనిటీ లో షెల్టర్ తీసుకుని, జిల్లాలో అప్రతిహతంగా తన దందాను కెపి చౌదరి కొనసాగించినట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి… నగరానికి దూరంగా విజయవాడ, హైదరాబాద్, బెంగుళూర్ లాంటి నగరాలనుండి వచ్చే వారికి అనువుగా ఉన్న ఈ గేటెడ్ కమ్మ్యూనిటీ విలాస సముదాయంలోనే కెపి చౌదరి తనకు షెల్టర్ జోన్ గా ఉపయోగించుకున్నట్లు ప్రాధమిక విచారణలోనూ తేలింది… ఇదే నివాస సముదాయాలలో తమ సామాజిక వర్గానికి చెందిన ఓ పోలీస్ ఉన్నతాధికారితో సైతం కెపి చౌదరికి సత్సంబందాలు తోనే రియల్ ఎస్టేట్, మధ్యం వ్యాపారులు, నిర్మాణ రంగ ప్రముఖులు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, అధికార పార్టీ పెద్దలతో విస్తృత పరిచయం నెరిపినట్లు తెలుస్తుంది.. దీంతో కెపి చౌదరి అండ్ టీం కు జిల్లా వ్యాప్తంగా తన వ్యాపార విస్తరణకు అడ్డులేకుందా పోయిందనే వాదనలు పోలీస్ శాఖ నుండే వస్తున్నాయి… అన్నీ తెలిసినా అంటీ ముట్టనట్లు వ్యవహరించటానికి ఆ ప్రముఖ పరిచయాలే కారణమని నర్మగర్భ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి…

- Advertisement -

అయితే రాజధానిలో డ్రగ్స్ కలకలం మూలాలు ఖమ్మంకు విస్తరించటం, అసలు కధ మొత్తం జిల్లా నుండే నడిచినట్లు తేటతెల్లం కావటం, ఒక్క కేపి చౌదరి మాత్రమే కాకుండా అనేక మందికి ఖమ్మం నగరంలో మత్తు వాసనలు అంటించినట్లుగా వస్తున్న ‘కధ’ నాలన్ని చివరికి కంచికి చేరతాయా, పెద్దోళ్ళ తో సంబంధాలున్న ఈ తీగను ఎక్కడ తెగ కొడ్తారు..? ఎన్నో వత్తిడులు దర్యాప్తు అధికారులకు భారంగా మారనున్నాయా? లేదా వీటన్నింటినీ అధిగమించి నిజాలు నిష్పక్షపాతంగా బయటకు వస్తాయా..? అనేది కెపిచౌదరి ని కస్టడీలో కి తీసుకుని విచారించినప్పుడే అసలు గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు