Monday, April 29, 2024

పోలీసుల అదుపులో సార్క్ ఎన్ స్క్వేర్ డైరెక్టర్లు..

తప్పక చదవండి
  • తనను చీటింగ్ చేశారని రాయదుర్గం పోలీసులను
    ఆశ్రయించిన ఎం.డీ. అట్లూరి నవీన్ రెడ్డి..
  • కట్ట సరీన్ రెడ్డితో కలిసి అతని కంపెనీ అయిన సార్క్ ప్రాజెక్ట్స్ కి
    సార్క్ ఎన్ స్క్వేర్ కి సంబందించిన ల్యాండ్స్ అన్నీ ఫోర్జరీ సంతకాలతో
    తరలించారని ఆరోపణలు..
  • సార్క్ ఎన్ స్క్వేర్ కంపెనీని మోసం చేసి, ల్యాండ్స్, డబ్బుని
    తరలించిన పిమ్మట కట్ట సరీన్ రెడ్డి, ముమ్మారెడ్డి శ్రీధర్ రెడ్డిలు
    సార్క్ ఎన్ స్క్వేర్ కంపెనీ నుండి తప్పుకున్నట్లు తెలిపిన నవీన్ రెడ్డి..
  • వీరిలో వీరు గొడవలు పడుతూ వేలమంది అమాయకులను మోసం చేసే
    కుట్రలో భాగమే అంటున్న బాధితులు..

పూర్వం పెద్దలు ఒక కథ చెప్పేవారు.. ఇద్దరు మోసగాళ్లు జనాలను మోసంచేసి భారీగా ధనం కూడబెట్టారు.. తమను మోసం చేసిన విషయం గ్రహించిన బాధితులు తమ డబ్బును తమకు చెల్లించాలని ఒత్తిడి తెస్తుండటంతో.. మోసగాళ్లు ఇద్దరూ ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఒక పన్నాగం పన్నుతారు.. తమలో తమకు విభేధాలు వచ్చాయని.. ఒకరు ఇంకొకరిని మోసం చేశారని.. బాధితులనుండి వసూలు చేసిన డబ్భులు ఎదుటివారు కాజేశారని ఆరోపణలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు పోలీసు కేసులు పెట్టుకుంటారు.. వ్యవహారం న్యాయస్థానం వరకు వెళ్తుంది.. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది కనుక బాధితులు మరికొంత కాలం వేచిచూడాలని కోర్టు సూచిస్తుంది.. సంబంధిత అధికారులు, పోలీసులు కూడా వ్యవహారం కోర్టు పరిధిలో వుంది కనుక తాము ఏమీ చేయలేమని చేతులెత్తేస్తారు.. ఇక కేసులు, కోర్టులు అంటూ వ్యవహారం తేలడానికి సంవత్సరాల కాలం పడుతుంది.. అప్పటికే అప్పులు చేసి మోసగాళ్లకు డబ్బులు చెల్లించిన బాధితులు.. ఇంకా ఖర్చుపెట్టే స్థోమత లేక ఉస్సూరుమంటూ.. పోతే పోయాయి.. తమ తలరాత ఇంతే అనుకుని తమ దైనందిన కార్యక్రమాల్లో మునిగిపోతారు.. ఇక కోర్టు కేసు ముగిసేది ఎన్నడో..? బాధితులకు న్యాయం జరిగేది ఎన్నడో..? ఈ సమస్యకు పరిష్కారం అనేది కనుచూపు మేరలో కనిపించకపోవడం శోచనీయం.. మొత్తానికి జనాలను మోసం చేసిన వారు మాత్రం సేఫ్.. ఇదే తరహా భాగోతం ఇప్పుడు సార్క్ ఎన్ స్క్వేర్ సంస్థలో చోటుచేసుకుంది.. ఈ సంస్థలో భాగస్తులుగా ఉన్న ఇద్దరు పెద్దమనుషులుగా చలామణి అవుతున్న మోసగాళ్లు తాము చేసిన మోసాల నుండి తప్పించుకోవడానికి సరికొత్త డ్రామాకు తెరలేపారు.. వివరాలు ఒకసారి చూద్దాం..

హైదరాబాద్, 24 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
సార్క్ ఎన్ స్క్వేర్ డైరెక్టర్లు పసునూరి నవీన్ కుమార్, ముమ్మారెడ్డి శ్రీధర్ రెడ్డిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. చీటింగ్, ఫోర్జరీ కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు రాయదుర్గం పోలీసులు. తన కంపెనీని రూ. 100 కోట్ల పైబడి మోసం చేశారని పోలీసులను ఆశ్రయించారు మేనేజింగ్ డైరెక్టర్ అట్లూరి నవీన్ రెడ్డి. కాగా రెండేళ్ల క్రితం సార్క్ ఎన్ స్క్వేర్ ప్రైవేట్ లిమిటెడ్, సార్క్ ఎన్ స్క్వేర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట.. కట్ట సరీన్ రెడ్డితో కలిసి జాయింట్ వెంచర్‌ మొదలు పెట్టాడు నవీన్ రెడ్డి. నవీన్ రెడ్డి కంపెనీ అయిన ఎన్ స్క్వేర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి కస్టమర్ల ద్వారా రూ. 18 కోట్లు వసూలు చేశారు పసునూరి నవీన్ కుమార్, శ్రీధర్ రెడ్డిలు.. తిరిగి వారిని ప్రశ్నిస్తే తనపై బెదిరింపులకు పాల్పడుతునారు అని వాపోయారు అట్లూరి నవీన్ రెడ్డి..

- Advertisement -

పైగా నిందితులు బలవంతంగా తన ఆఫిస్ లోకి చొరబడి ఎన్ స్క్వేర్ ప్రాజెక్ట్స్, సార్క్ ఎన్ స్క్వేర్ కంపెనీల డేటా మొత్తం చోరీ చేసిన పసునూరి నవీన్ కుమార్, ముమ్మారెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరు సరిన్ రెడ్డితో చేతులు కలిపి.. ఎన్ స్క్వేర్, సార్క్ ఎన్ స్క్వేర్ కి సంబందించిన ల్యాండ్స్ అన్నీ కట్టా సరీన్ రెడ్డి సొంత కంపెనీ అయిన సార్క్ ప్రాజెక్ట్స్ కి అక్రమంగా ఫోర్జరీ సంతకాలు చేసి తరలించారని అట్లూరి నవీన్ రెడ్డి ఆరోపిస్తున్నారు.. సార్క్ ఎన్ స్క్వేర్ కంపెనీని మోసం చేసి, ల్యాండ్స్, డబ్బుని తరలించిన పిమ్మట కట్ట సరీన్ రెడ్డి, ముమ్మారెడ్డి శ్రీధర్ రెడ్డిలు సార్క్ ఎన్ స్క్వేర్ కంపెనీ నుండి తప్పుకున్నారు.. పసునూరి నవీన్ కుమార్, కృష్ణ ప్రవీణ జోగా అనే అమ్మాయితో కలిసి ఎన్ స్క్వేర్ కంపెనీ ఫండ్స్ ని తరలించారని నవీన్ రెడ్డి ఆరోపించారు.. ఈ రెండు కంపెనీల్లో అట్లూరి నవీన్ అయిన తాను అధిక షేర్ హోల్దర్ అయినప్పటికీ మిగతా నిందితులు దౌర్జన్యం చేసినట్లు తెలిపారు.. సార్క్ డైరెక్టర్ కట్టా సరీన్ రెడ్డి, స్మితారెడ్డితో పాటు మొత్తం 14 మందిపై ఫిర్యాదు చేసి, వారి అందరిపై చర్యలు తీసుకోవాలని, తనకి న్యాయం జరిగేలా చేయమని రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు అట్లూరి నవీన్ రెడ్డి..

కాగా ఐపీసీ 327, 378, 383, 385, 388, 403, 405, 420, 423, 441, 463, 464, 46, 120 బీ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు రాయదుర్గం పోలీసులు. ముమ్మారెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలో అమెరికాలో కేంబ్రిడ్జ్ రిసోర్స్ అనే సాఫ్ట్ వేర్ కన్సల్టింగ్ కంపెనీ పేరుతో ప్రజలని మోసం చేసి.. రెండు నెలలు జైలు జీవితం గడిపాడు. అమెరికా గవర్నమెంట్ యూ.ఎస్.ఏ. వీసా మీద రెడ్ కార్నర్ మార్క్ వేసి, మళ్ళీ అమెరికాకి తిరిగి రాకూడదనే నిబంధనలతో ఇండియాకి పంపారు అక్కడి అధికారులు.. బెంగళూరులో ఎక్సెల్ అనే రియల్ ఎస్టేట్ పేరుతో అక్కడ జనాలని మోసం చేసి 2019లో హైదరాబాద్ కి వచ్చి.. రియల్ ఎస్టేట్ కంపెనీ నీకిత్ ఎస్టేట్స్ స్టార్ట్ చేసాడు. శ్రీధర్ రెడ్డి మీద ఇప్పటికే బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్ లో 4 ఎఫ్.ఐ.ఆర్.లు చీటింగ్ కేసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.. ఇక్కడ పసునూరి నవీన్, కట్ట సరీన్ రెడ్డితో చేతులు కలిపి రూ. 100 కోట్లకు పైగా సార్క్ ఎన్ స్క్వేర్ ఆస్థులను తరలించారని అట్లూరి నవీన్ రెడ్డి ఆరోపించారు.. కాగా అట్లూరి నవీన్ పై గతంలో తప్పుడు ఫిర్యాదు చేసి తప్పించుకోవాలని మిగతా నిందితులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు