Sunday, May 19, 2024

డా.జహీదా బేగం ను వరించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్..

తప్పక చదవండి
  • డాక్టర్ జహీదా బేగంను అభినందించిన ఉస్మానియా వీసీ రవీందర్..
    ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సవిన్ సోడా..

హైదరాబాద్: ప్రతి వ్యక్తికి ఒక్కో రంగంలో ప్రావీణ్యం ఉంటుంది. తాము ఎంచుకున్న రంగంలో మెలకువలు సంపాదిస్తూ ముందడుగు వేస్తారు. అరుదుగా కనిపించే మరికొందరు వ్యక్తులు తాము ఎంచుకున్న రంగంలో రాణిస్తూనే ఇతర రంగాలపై పట్టు సాధిస్తూ విజయ బావుటా ఎగురవేస్తారు. ఈ కోవకు చెందిన వారే హయత్ నగర్ కు చెందిన డా.జహీదా బేగం. హయత్ నగర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగాధికారిణిగా తన వృత్తిని కొనసాగిస్తూనే ఎన్.ఎస్.ఎస్ అధికారినిగా రాచకొండ కమిషనరేట్ మార్గదర్శక్ గా కొనసాగుతూనే.. మరో ప్రక్క సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పలు సేవా కార్యక్రమాల ద్వారా విశిష్ట సేవలు అందిస్తున్న ఆమెకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో అరుదైన చోటు లభించింది. ప్రపంచ అతిపెద్ద గ్రంథంలో ఎడిటర్ గా 200 ఆర్టికల్స్ షీ ఫర్ హర్ సెల్ఫ్ పుస్తక రచయితగా ప్రపంచ అతిపెద్ద గ్రంథంలో భాగస్వాములైనారు డా. జహీదా బేగం.. అందుకుగాను ఆగస్టు 28న చెన్నైలోని హోటల్ తురియాలో నిర్వహించిన కార్యక్రమంలో దేశం గర్వించేలా శత్రువు సైతం కీర్తించేలా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నిర్వాహకుల చేతుల మీదుగా ప్రత్యేక ప్రశంసా పత్రము, గిన్నిస్ రికార్డు అధికారిక సర్టిఫికెట్ అందుకున్నారు.. అందరి మహిళల లాగా కాకుండా నీకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని నిన్ను నీవు శిల్పంగా మార్చుకుని అందరికీ ఆదర్శప్రాయంగా నిలవాలని తన తండ్రి నూరిపోసిన మాటలను నిత్యం మదిలో స్మరించుకుంటూ ఆ దిశగా అడుగులేస్తూ తన తండ్రి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన ధన్యజీవి డాక్టర్. జహీదాబేగం. ఎన్నో కష్టనష్టాలకోర్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించడం దేశానికి తమ యూనివర్సిటీకి గర్వకారణమని ఆమెకు పలువురు అభినందనలు తెలియజేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు