Saturday, July 27, 2024

పేదల ఆత్మగౌరవానికి ప్రతీక డబుల్‌ ఇళ్లు

తప్పక చదవండి
  • పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక
  • మోర్తాడ్‌లో ఇళ్లను అప్పగించిన మంత్రి వేముల

నిజామాబాద్‌
పేదల ఇంటికలను సాకారం చేస్తున్నామని, పారదర్శకంగగా ఇల్లను కట్టించి అందచేస్తున్నామని రాష్ట్ర రోడ్లు`భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. పేదలంతా గౌరవంగా బతకాలన్నదే కెసిఆర్‌ సంకల్పమని అన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకంలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా, పారదర్శకంగా అధికార యంత్రాంగం లబ్దిదారులను ఎంపిక చేసిందని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగా, రాజకీయ జోక్యానికి తావు లేకుండా అర్హత ప్రాతిపదికన ఇండ్లు పంపిణీ చేస్తున్నామని వెల్లడిరచారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్‌ మండల కేంద్రంలో శుక్రవారం ప్రభుత్వం నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. లబ్దిదారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, నూతన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పత్రాలను లబ్దిదారులకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఒకే సముదాయంలో అన్ని వసతులతో మొత్తం 224 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించగా, తొలివిడతగా 155 మంది లబ్దిదారులకు ఇళ్లను పంపిణీ చేశామని ఆయన అన్నారు. లబ్దిదారుల కోరిక మేరకు సముదాయానికి కేసీఆర్‌ కాలనీగా నామకరణం చేశారు. మోర్తాడ్‌లో డబుల్‌ నిర్మాణాల కోసం రూ. 15 కోట్లు మంజారు చేయించానని, అందులో రూ. 13.5 కోట్లు ఇళ్ల నిర్మాణాలకు వెచ్చించగా మిగతా నిధులతో రోడ్ల నిర్మాణాలు జరిపించామని వివరించారు. అర్హులైన వారిని ఎంపిక చేసేలా అధికారులకు పూర్తి స్వేచ్ఛ కల్పించామని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సైతం జోక్యం చేసుకోకుండా లబ్దిదారుల ఎంపిక జరిగిందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి దశల వారీగా ఇళ్లను పంపిణీ చేస్తామని భరోసా కల్పించారు. ఇది నిరంతర పక్రియ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్‌, జడ్పీటీసీ రవి, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రమేష్‌ రెడ్డి, ఆర్మూర్‌ ఆర్డీవో వినోద్‌ కుమార్‌, ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ రాజేశ్వర్‌ రెడ్డి, డీఎల్‌పీవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు