Saturday, May 18, 2024

ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న యమునా నది..

తప్పక చదవండి
  • కేజ్రీవాల్‌ ఇంటిని ముంచిన వరదద నీరు..
  • వరద ప్రాంతాలను వీడి వెళ్లాలని ఆదేశాలు..
  • వజీరాబాద్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ మూసివేత..
  • విద్యా సంస్థలకు సెలవుల ప్రకటన..
  • రంగంలోకి దిగిన ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలు

ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది మరింతగా ఉప్పొంగింది. ఫలితంగా రోడ్లు, ఇళ్లు వరదనీటిలో చిక్కుకున్నాయి. నీటిని కిందికి విడిచిపెడుతున్నా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ప్రస్తుతం నది ప్రమాద స్థాయికి మూడు విూటర్ల పైన ప్రవహిస్తోంది. ఢిల్లీతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో యమునా నది హోగ్రరూపం దాల్చింది. వరద నీరు పోటెత్తడంతో ఆల్‌టైం రికార్డ్‌ స్థాయికి చేరుకుంది. గురువారం ఉదయం ఏడు గంటలకు హర్యానాలోని హత్నికుండ్‌ బ్యారేజీలో యుమున నది 208.46 విూటర్ల స్థాయికి చేరుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ నివాసం, ఢిల్లీ అసెంబ్లీ సవిూపానికి వరద నీరు చేరుకుంది. అలాగే, సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలోని రింగ్‌రోడ్డు మునిగిపోయింది. నీటి స్థాయిలు పెరుగుతుండడంతో వజీరాబాద్‌ లోని వాటర్‌ ట్రీట్‌మెంట్ ప్లాంటును మూసివేశారు. ఢిల్లీ లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను మూసివేస్తున్నట్టు సిఎం కేజీవ్రాల్‌ ప్రకటించారు. వరద ప్రాంతాలను ప్రజలు వీలైనంత త్వరగా విడిచి వెళ్లాలని అభ్యర్థించారు. సహాయ కార్యక్రమాల్లో ఉన్న సిబ్బంది, అధికారులకు సహకరించాలని ఆదేశించారు. సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ వాజీరాబాద్ లోని ప్లాంట్‌ ను సందర్శించి పరిస్తితిని అంచనా వేశారు. తొలిసారి యమునా నదిలో ఈ స్థాయిలో నీరు వచ్చినట్లు సీఎం కేజ్రీ వాల్ తెలిపారు. పంపులు, మెషీన్లలోకి నీరు ప్రవేశించడం వల్ల మూడు వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లను మూసి వేసినట్లు ఆయన వెల్లడించారు.. దీని కారణంగా ఢిల్లీలో సుమారు 25 శాతం నీటి సరఫరా తగ్గిపోతుందని ఆయన తెలిపారు. బోర్లను కూడా మూసివేసినట్లు ఆయన చెప్పారు. ఒకటి లేదా రెండు రోజుల పాటు ఢిల్లీ లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం సాయంత్రం తర్వాత మళ్లీ నీటి సరఫరా పునరుద్దరణ జరిగే అవకాశాలు ఉన్నట్లు సీఎం వెల్లడించారు.. కేంద్ర జల సంఘం ప్రకారం గురువారం సాయంత్రం 4 గంటల వరకు యమునా నది ప్రవాహం హెచ్చ స్థాయికి చేరుకుంటుందని, ఆ తర్వాత నీటి మట్టం తగ్గడం ప్రారంభం అవుతుందని సీఎం తెలిపారు. రాజ్‌ఘాట్‌ నుంచి సెక్రటేరియ్‌కు వెళ్తున్న రోడ్డు జలమయం అయ్యింది. యమునా బ్యాంక్‌ మెట్రో స్టేషన్‌ను క్లోజ్‌ చేశారు. యమునా నది ఈ స్థాయిలో ప్రవహించడం చరిత్రలో ఇదే తొలిసారి. 1978లో నీటి మట్టం 207.49 విూటర్లకు చేరడంతో ఢిల్లీ ని భారీ వరదలు ముంచెత్తాయి. ఇప్పుడు ఆ రికార్డును కూడా దాటడంతో అటు అధికారులు, ఇటు ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ లోని పాత రైల్వే వంతెనే వద్ద యమునా నది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. యమునా ఉప్పొంగడంతో సవిూప ప్రాంతాలు పూర్తిగా జలమయ మయ్యాయి. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోని నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలో రింగ్‌ రోడ్డు పూర్తిగా నీటమునిగింది. కశ్మీరీ గేట్‌ `మంజు కా తిలాని కలిపే ప్రాంతంలో భారీగా వరద చేరి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌, ఢిల్లీ అసెంబ్లీకి కేవలం 500 విూటర్ల దూరంలో మాత్రమే ఉంది. మరోవైపు భారీ వర్షాలకు తోడు వరద ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే సహాయక చర్యల నిమిత్తం 12 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దింపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఢిల్లీ సీఎం స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు