Sunday, May 5, 2024

నేడు చంద్రయాన్‌ 3 ప్రయోగం..

తప్పక చదవండి
  • లాంచ్‌ కంట్రోల్‌ ఆపరేషన్స్‌లో చయన్‌ దత్తా..
  • ఆనందంలో అస్సావిూ తేజపూర్‌ విద్యార్థులు..
  • గురువారం ఉదయం తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇస్రో బృందం..
  • చంద్రయాన్ 3 విజయవంతం కావాలని పూజలు..

ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న చంద్రయాన్‌ 3 ప్రయోగం నేపథ్యంలో అస్సాంలోని తేజ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. అస్సాంకు మాత్రమే కాకుండా యావత్తు దేశానికి ఎంతో గర్వకారణమైన ఈ సందర్భాన్ని విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా ఆస్వాది స్తున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో చదవిన విద్యార్థి చయన్‌ దత్తా భాగస్వామ్యం కూడా చంద్రయాన్‌ 3లో ఉండటాన్ని గర్వకారణంగా భావిస్తున్నారు. అస్సావిూస్‌ శాస్త్రవేత్త, తేజ్‌పూర్‌ విశ్వవిద్యాలయం విద్యార్థి చయన్‌ దత్తా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్‌ 3 ప్రయోగంలో లాంచ్‌ కంట్రోల్‌ ఆపరేషన్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఈ విశ్వవిద్యాలయంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్టాన్రిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి. ఆయన ప్రస్తుతం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌, యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌లో సైంటిస్ట్‌/ఇంజినీర్‌జీగా పని చేస్తున్నారు. ఆయన చంద్రయాన్‌ 3, ల్యాండర్‌, డేటా హ్యాండ్లింగ్‌ అండ్‌ స్టోరేజ్‌, ఆన్‌బోర్డ్‌ కమాండ్‌ టెలిమెట్రీకి నేతృత్వం వహిస్తున్నారు. కమాండ్‌ అండ్‌ డేటా హ్యాండ్లింగ్‌ సబ్‌ సిస్టమ్‌ ఈ ఆర్బిటర్‌కు బ్రెయిన్స్‌గా పని చేస్తుంది. వ్యోమనౌక కార్యకలాపాలన్నిటినీ ఇది నియంత్రిస్తుంది. చంద్రయాన్‌ 3 ప్రయోగం ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీహరి కోట నుంచి శుక్రవారం జరుగుతుంది. దత్తా మాట్లాడుతూ, ఈ బాధ్యతను తనకు అప్పగించడం తనకు లభించిన గొప్ప గౌరవమని తెలిపారు. ఈ మిషన్‌ మన దేశానికి, ప్రపంచ శాస్త్ర సమాజానికి గొప్ప మైలురాయిగా నిలుస్తుందన్నారు. తేజ్‌పూర్‌ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్‌ శంభు నాథ్‌ మాట్లాడుతూ, చంద్రయాన్‌ 3 బృందాన్ని అభినందించారు. రోదసి అన్వేషణకు భారత దేశం కట్టుబడి, నిబద్ధతతో పని చేస్తోందని ఈ కీలక పరిణామం స్పష్టం చేస్తోందన్నారు. అంతే కాకుండా మన దేశంలో ఉన్న అసాధారణ ప్రతిభా పాటవాలు, నైపుణ్యాలను గొప్పగా వెల్లడిస్తోందన్నారు. ఇది మన దేశానికి, అస్సాంకు, తేజ్‌పూర్‌ విశ్వవిద్యాలయానికి గర్వపడే సమయమని తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో బృందం
చంద్రయాన్‌ విజయవంతం కోసం ప్రార్థన :
కాగా చంద్రయాన్‌ 3 మిషన్‌ను శుక్రవారం ఇస్రో చేపట్టనున్నది. మధ్యాహ్నం 2.35 నిమిషాలకు రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌ 3ను ప్రయోగించనున్నారు. ప్రయోగం సక్సెస్‌ కావాలని కోరుతూ గురువరాం ఉదయం ఇస్రో చీఫ్‌ ఎస్‌. సోమనాథ్‌.. తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. నేడు చంద్రయాన్‌ 3 రోవర్‌.. చంద్రుడిపై దిగుతుందని ఆయన తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తల బృందం తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. చంద్రయాణ్‌ 3 ప్రతిమతో శాస్త్రవేత్తలు ఆలయాన్ని విజిట్‌ చేశారు. నేషనల్‌ అట్మాస్పియరిక్‌ రీసర్చ్‌ ల్యాబరేటరీ డైరెక్టర్‌ అమిత్‌ కుమార్‌ పత్రా, చంద్రయాన్‌ 3 ప్రాజెక్టు డైరెక్టర్‌ వీరాముత్తు వేల్‌, అసోసియేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కల్పనా కాళహస్తితో పాటు ఇతర శాస్త్రవేత్తలు కూడా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. చంద్రుడి అధ్యయనం కోసం ఇస్రో ఈ మిషన్‌ చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే చంద్రుడిపై స్పేస్‌క్రాప్ట్‌ను దించబోతున్న నాలుగవ దేశంగా ఇండియా రికార్డు క్రియేట్‌ చేయనున్నది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు