Saturday, July 27, 2024

కమిషనర్‌ జీహెచ్‌ఎంసీని క్లీన్‌ అండ్‌ స్వీప్‌గా మారుస్తారా

తప్పక చదవండి
  • రోనాల్డ్‌ రాస్‌ ఎంట్రీతో గుబులు పడుతున్న ఉద్యోగులెవ్వరు
  • ఆయన రాకతో ఎల్బీనగర్‌ జోన్‌ అధికారులకు వణుకెందుకు
  • అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఉపేక్షించని రోనాల్డ్‌ రాస్‌
  • అవినీతిమయమైన జీహెచ్‌ఎంసీని ఇప్పుడెలా ప్రక్షాళన చేస్తారు..
  • జి హెచ్‌.ఎం.సి కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ ఎంట్రీ ఫై ఆదాబ్‌ ప్రత్యేకం

ఎల్బీనగర్‌ : జి హెచ్‌.ఎం.సి కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ రాకతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది ఎల్బీనగర్‌ జోన్‌ అధికారుల గుండెల్లో భయం మొదలయ్యింది ? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఇక వేటు పడనుందా? అనే ప్రశ్నలు సర్వత్రా ఉత్పన్నమవుతున్నాయి. గతంలో మహబూబ్‌ నగర్‌ జిల్లా కలెక్టర్‌ గా భాద్యతలు నిర్వర్తించిన సమయంలో రోనాల్డ్‌ రాస్‌ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులను విచారణ జరిపి అనంతరం సస్పెండ్‌ చేసారు.. ?అప్పుడు ఈ వార్త సంచలన మయ్యింది. ఈ మేరకు ప్రస్తుతం జి హెచ్‌.ఎం.సిలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది అధికారులపై ఆయన ఏ చర్యలు తీసుకుంటారన్న చర్చ జరుగుతుంది . నిజానికి ఎల్బీనగర్‌ జోన్‌ లో అక్రమ నిర్మాణాలపై ఆదాబ్‌ హైదరాబాద్‌ దిన పత్రిక ఎన్నో కథనాలను ప్రచురించింది ? విజిలెన్స్‌ విభాగం అక్రమ నిర్మాణాల కథనాలపై స్పందించి .. అక్రమ నిర్మాణాలకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ ఆదాయానికి పరోక్షంగా గండి కొడుతున్న ఏ.సి.పి దేవేందర్‌, సెక్షన్‌ ఆఫీసర్‌ కిష్టయ్య, పై దర్యాప్తునకు ఉన్నతాధికారులు ఓ అధికారిని నియమించారు ..? దర్యాప్తు కొనసాగుతున్న ? ఐ డోంట్‌ కేర్‌ అంటూ యదెచ్చగా అక్రమ నిర్మాణదారులకు కొండంత అండదండలు కల్పిస్తున్న ఏ.సి.పి దేవేందర్‌, సెక్షన్‌ ఆఫీసర్‌ కిష్టయ్య లపై జి హెచ్‌.ఎం.సి కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ ఎం చర్యలు తీసుకుంటారో నన్న ఉత్కంఠ మొదలయ్యింది. ??..టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఎందరో అనాధికారిక సిబ్బంది పనిచేస్తున్నారు. వారిని పట్టించుకున్న నాధుడు లేడు ? వారు ఏలాంటి విధులు నిర్వర్తిస్తున్నారు అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది ?…
దేశంలో నిర్మాణరంగంలో ఆతీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌ నగరం ఒక్కటి. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా ఆర్థికంగా స్థిరపడిన కొందరు నగరంలోనే తమ సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు.అయితే గ్రేటర్‌ నగరంలో కొందరు నిర్మాణదారులు సిస్టంలో కొన్నిలోపాలను అవకాశంగా మార్చుకుని చిన్న, చిన్న, చెరువులను కుంటలను , ప్రభుత్వ స్థలాలను సైతం కొంతమంది అధికారుల సహకారంతో ఆక్రమించుకుని ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతూ.. ప్రభుత్వానికి పర్యవరణానికి తీవ్ర నష్టం చేకూరుస్తున్నారు. అక్రమ నిర్మాణాల కారణంగా వరదలు, విపత్తులు వచ్చినప్పుడు జన జీవనం స్తంభించి… ఆస్తి, ప్రాణ, నష్టాలు సంభవిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలకు తావు లేకుండా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టి.ఎస్‌.బి పాస్‌.. చట్టాన్ని సైతం కొంతమంది అక్రమానిర్మాణదారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. డొమెస్టిక్‌ అనుమతులు తీసుకుని కమర్షియల్‌ భవనాలు చేపడుతున్నారు. రెండంతస్తుల భవనానికి అనుమతులు తీసుకుని నాలుగు, ఐదు అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు ? సెల్లార్‌ అనుమతులు తీసుకోరు కానీ సెల్లార్‌ నిర్మాణ పనులు కొనసాగుతాయి…? సరూర్‌ నగర్‌ సర్కిల్‌ అక్రమ నిర్మాణాలపై ఆదాబ్‌ హైదరాబాద్‌ పత్రికలో ఎన్నో వరుస కథనాలు వచ్చాయి ? వాటికి అధికారులు ఏనాడు స్పందించలేదు ? అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే వాటిని పరిశీలించే లోపే నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ఇప్పుడు …కమిషనర్‌ గా రోనాల్డ్‌ రాస్‌ రాకతో జి హెచ్‌.ఎం.సి లో అవినీతికి శుభం కార్డు పడనుందా లేక రాజకీయ ఒత్తిడులకు తలొగ్గి ఆయన కూడా ఇదే తంతును కొనసాగిస్తారా అన్నది వేచి చూడాలి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు