Saturday, July 27, 2024

జాతీయ రహదారి 65పై ప్రైవేట్ బస్సులో తరలిస్తున్న గంజాయి పట్టివేత ..!

తప్పక చదవండి

మహిళను అదుపులోకి తీసుకున్న ఆబ్కారి పోలీసులు

హయత్‌ నగర్‌ : రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ డేవిడ్‌ రవికాంత్‌, అసిస్టెంట్స్‌ కమిషనర్‌ ఏ. చంద్రయ్య, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ టి.రవీందర్‌ రావు ఆదేశాల ప్రకారం గత మూడు రోజులుగా సరిహద్దు జిల్లాల నుండి విజృంభిస్తున్న ఎక్సైజ్‌ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా చెక్‌ పోస్ట్‌ లను అసిస్టెంట్స్‌ ఎక్సైజ్‌ సూపింటెండెంట్‌ బి. హనుమంత రావు పర్యవేక్షణలో ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్‌ అధికారులు ఎఇఎస్‌ జీవన్‌ కిరణ్‌, హయాత్‌ నగర్‌ ఎక్సైజ్‌ ప్రత్యేక బృందం సోమవారం ఉదయం రామోజీ ఫిల్మ్‌ సిటీ వద్ద సంయుక్తంగా వాహనాలను తనికీ చేస్తుండగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ లో విశాఖ పట్నం అరకులోయ నుంచి ఒక మహిళ నుంచి 12 కిలోల గంజాయిని తీసుకొని వస్తుండగా పట్టుకొని స్వాధీనం చేసుకున్నాము. ఒక్కో పాకెట్లో రెండు కిలోల చొప్పున మొత్తం ఆరు పాకెట్స్‌ నుంచి 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని హయత్‌ నగర్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ ఇన్స్పెక్టర్‌ లక్ష్మణ్‌ తెలిపారు. ఈ మహిళ అక్కడ అరకులో కిలో 6000/- లకు కొనుక్కుని మహారాష్ట్ర లోని కళ్యాణ్‌ పట్టణానికి రవాణా చేస్తున్నట్లు తన విచారణలో వెల్లడిరచిందని హయాత్‌ నగర్‌ ఎక్సైజ్‌ సీఐ టి. లక్ష్మణ్‌ గౌడ్‌ తెలిపారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రంగారెడ్డి జిల్లాలో ఎలాంటి ఎక్సైజ్‌ నేరాలకు తావులేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయని, నేరాలను అరికట్టేందుకు నిరంతరం గట్టి నిఘాను, ప్రత్యేక బృందాలు 24 గంటలు అందుబాటులో ఉండాలని డిప్యూటీ కమిషనర్‌ తెలిపారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ దాడులలో సిఐలు పి.శ్రీధర్‌, ఎస్‌.కల్పన, టి.సత్యనారాయణ, ఎస్‌ఐ లు హన్మంతు, వెంకన్న గౌడ్‌, సరళ, సరూర్‌ నగర్‌ డివిజన్‌ లోని ఎక్సైజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాల నుండి వచ్చే గంజాయిని పూర్తిగా నిరోధించడానికి గట్టిగా ప్రయత్నిస్తామని ఈసందర్భంగా ఎక్సైజ్‌ సిఐ టి. లక్ష్మణ్‌ గౌడ్‌ తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు