Tuesday, September 10, 2024
spot_img

జిల్లాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్

తప్పక చదవండి
  • ఈ నెల 19న మెదక్ జిల్లాలో పర్యటన
  • ఈ నెల 20న సూర్యాపేట జిల్లాలో పర్యటన
  • జిల్లా కలెక్టరేట్ భవనాలు, ఎస్పీ కార్యాలయాలకు ప్రారంభోత్సవం
  • నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీని కూడా ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
    తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 19, 20 తేదీలో జిల్లాల్లో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 19న మెదక్ జిల్లాలో, ఈ నెల 20న సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు.

సీఎం కేసీఆర్ వచ్చే శనివారం నాడు మెదక్ జిల్లాలో పర్యటించి జిల్లా కలెక్టరేట్ భవనం, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ మరుసటి రోజు సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ పర్యటనలో భాగంగా, జిల్లాలో కొత్తగా నిర్మించిన వైద్య కళాశాల కూడా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోనుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు