Friday, July 19, 2024

అద్భుతంగా జరిగిన ఆహార దినోత్సవం వేడుకలు

తప్పక చదవండి

రామంతపూర్ లోని స్ఫూర్తి మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం తెలంగాణ ఆహార దినోత్సవ వేడుకలను అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్ఫూర్తి మహిళా డిగ్రీ కళాశాల చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్ హాజరై వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్ గారు మాట్లాడుతూ తెలంగాణ వంటలలో పలు రకాల ఆహార పదార్థాలు చాలా శ్రేష్టమైనవని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఆహార పదార్థాలపై అవగాహన కలిగించేందుకే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కళాశాల చైర్మన్ గారు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా తయారు చేసిన ఆహార పదార్థాలను వేడుకలలో ప్రదర్శించారు ముఖ్యంగా తెలంగాణ బిర్యాని. పలావ్ బిర్యానీ, పిండి వంటలు, స్వీట్ ఆహార పదార్థాలను ఏర్పాటు చేశారు విద్యార్థులు అందరూ ఉత్సాహంగా పాల్గొని వంటలను రుచి చూశారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు