Tuesday, July 16, 2024

మంత్రి మల్లారెడ్డి డౌన్‌ డౌన్‌

తప్పక చదవండి
  • మంత్రికి శామీర్‌పేట మండలం అలియాబాద్‌ గ్రామ ప్రజల నిరసన సెగ
  • సమస్యలు తీర్చాలని మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న అలియాబాద్‌ గ్రామస్తులు
  • సమస్యలు తీర్చలేని మంత్రి మా గ్రామానికి రావొద్దంటు నినాధాలు
  • నాలుగున్నరేళ్ళుగా లేనిది స్వంత నిధులతో
    అభివృద్ది పనులు ఇప్పడే గుర్తుకువచ్చాయా అంటు ప్రశ్నించిన గ్రామస్తులు
    శామీర్‌పేట: శామీర్‌పేట, మూడు చింతలపల్లి మండలాల్లో శనివారం సుడిగాలి పర్యటన చేసిన మంత్రి మల్లారెడ్డికి శామీర్‌పేట మండలం అలియాబాద్‌ గ్రామంలో నిరసన సెగ తగిలింది. అలియబాద్‌ గ్రామానికి వచ్చిన మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌ను ఆపిన గ్రామస్తులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఇప్పడు రోడ్లు, గుడులు తప్పా ఇంకా ఏ సమ స్యలు తన వద్దకు తీసుకురావద్దనడంతో అక్కడి ప్రజలు మంత్రి తీరుపై అసహనం వ్యక్తం చేస్తు మంత్రి మల్లారెడ్డి డౌన్‌ డౌన్‌ అంటు పెద్ద పెట్టున నిరసన నినాధాలు చేశారు. అంతే కాకుండా తమ సమస్యలు తీర్చలేని మంత్రి మల్లారెడ్డి తమ గ్రామానికి రావొద్దని, వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బుద్ది చెబు తామని హెచ్చరించారు. తమ గ్రామ సమస్య తీర్చమంటే ఎంపీ రేవంత్‌రెడ్డిని, బీజేపీ, కాంగ్రెస్‌, ఇతర పార్టీల నాయకులను పిలు చుకురామనడం ఎంత వరకు సమంజసమని ఇది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనలో ఆ గ్రామ నాయకులు వంగరి హృదయ్‌కుమార్‌, ముగ్దం సుధాకం ్‌రెడ్డి, పల్లె కుమార్‌, బండి రాంరెడ్డి, మల్యాల మహేష్‌, బోయిని రాములు, అల్లం శ్రీనివాస్‌, కుమార్‌, నరేష్‌, మహేష్‌, స్వామి, నాగరాజు, సురేష్‌, గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు