Monday, July 22, 2024

భూమిపై వాతావరణ మార్పులు

తప్పక చదవండి

జెనీవా: భూమిపై వాతావరణ మార్పులు ‘గ్లోబల్‌ వార్మింగ్‌ దశ నుంచి గ్లోబల్‌ బాయిలింగ్‌’ దశకు చేరుకొన్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ హెచ్చరించారు. భూగోళం ఉత్తర భాగంలో ఈ నెలలో నమోదైన అసాధారణ ఉష్ణోగ్రతలే అందుకు ఉదాహరణ అని తెలిపారు.
కర్బన ఉద్గారాల తగ్గింపుపై చర్యలు వెంటనే చేపట్టకుంటే మానవాళి వినాశనం తప్పదని ఆందోళన వ్యక్తంచేశారు. సెప్టెంబర్‌లో ఐరాస నిర్వహించే ైక్లెమేట్‌ యాంబిషన్‌ సమ్మిట్‌కు ముందు గురువారం సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గాలి పీల్చ లేనంతగా మారుతున్నదని ఆయన హెచ్చరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు