Thursday, May 2, 2024

అన్ని మతాలను కులాలను గౌరవించుకుంటూ సమాజంలో ముందుకు వెళ్లడం ముఖ్యం..

తప్పక చదవండి
  • కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌
    గజ్వేల్‌ : అన్ని మతాలను కులాలను గౌరవించుకుంటూ సమాజంలో ముందుకు వెళ్లడం ముఖ్యం అని కలెక్టర్‌ పేర్కొన్నారు, శుక్రవారం గజ్వేల్‌ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గడా కార్యాలయంలో నిర్వహించిన పీస్‌ కమిటీ మీటింగ్‌ కు జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అధ్యక్షత వహించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూభారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ప్రణవిల్లుతుందని తెలిపారు. జాతి, మతం, కులం, వర్గం అనే బేధాలు లేకుండా అందరూ కలిసిమెలిసిగా ఉండడం చాలా ముఖ్యమని తెలిపారు. ఏదైనా సంఘటన జరిగితే మత పెద్దలు, కుల పెద్దలు ముందుకు వచ్చి సమస్యను పరిష్కరించే విధంగా పలు చర్యలు చేపట్టాలని సూచిం చారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్లో తెలియపరచాలని సూచించారు. ఈ మధ్యకాలంలో ఏ చిన్న సంఘటన జరిగినా చాలామంది సోషల్‌ మీడియాల ద్వారా వైరల్‌ చేయడం జరుగుతుంది, అలాంటి పరిణామాలు సమాజానికి మంచిది కాదని సూచించారు. గజ్వేల్‌ పట్టణంలో పీస్‌ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని మతాలను కులాలను గౌరవించుకుంటూ సమాజంలో ముందుకు వెళ్లడం చాలా ముఖ్యమని తెలిపారు. తప్పు చేసిన వారిని చట్టం తప్పకుండా శిక్షిస్తుందన్నారు. ముఖ్యంగా యువతతో తల్లిదండ్రులు పెద్దలు కమ్యూనికేషన్‌ సత్సబంధాలు కలిగి ఉండాలని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. యువత ఆలోచన పెంచుకోవాలి ఆవేశాన్ని తుంచాలని తెలిపారు మైండ్‌ సెట్‌ మంచిగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయని తెలిపారు. అలాగే పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత మాట్లా డుతూ గజ్వేల్‌ అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తుందని వివిధ రాష్ట్రాల వారు గజ్వేల్‌ పర్యటించి గజ్వేల్‌ జరిగిన అభివృద్ధిని అనుసరిస్తున్నారని తెలిపారు జులై 3, 4 తేదీల్లో జరిగిన సంఘటన దురదృష్టకరమని అన్నారు గజ్వేల్‌ లో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధి సంక్షేమం గురించి పాటుపడాలన్నారు. గజ్వేల్‌ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు హిందూ, ముస్లింలు శాంతికాముకులని కొనియాడారు. గజ్వేల్‌ ఎన్నో రంగాలలో ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వివరించవలసిన అవసరం ఉందన్నారు. ఆరోజు జరిగిన సంఘటన త్వరగా ముగియడానికి సహకరించిన మతాల పెద్దలకు గజ్వేల్‌ పట్టణ ప్రజలకు ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే పోలీసులకు తెలియపరచాలని సూచించారు. సోషల్‌ మీడియాలో వచ్చే మంచిని స్వీకరించాలని చెడును త్రుంచివేయాలని తెలిపారు. సోషల్‌ మీడియా యువత భావజాలాలకు అనుకూలంగా తీసుకోవాలని సూచించారు. స్కూల్‌ లలో, కాలేజీలలో సోషల్‌ మీడియా సైబర్‌ నేరాలు మరియు చట్టాల గురించి పోలీసులు, షీటీమ్‌ సిబ్బంది అధికారులు ప్రతిరోజూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. బయట ఉండే యువతకు ప్రజలు ప్రజాప్రతినిధుల సహకారంతో సోషల్‌ మీడియా తదితర అంశాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మతాలకు అతీతంగా బ్రతకడం మన సమాజ అభివృద్ధికి చాలా ముఖ్యమని తెలిపారు. సోషల్‌ మీడియాలో మతాలకు కులాలను రెచ్చగొట్టే విధంగా ఇతర మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరైనా పోస్టులు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అట్లాంటివి కుల పెద్దలైన మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు తెలియపరచాలని సూచించారు. సోషల్‌ మీడియాలో ఇతరులను వేధించే మరియు భావజాలాలను వక్రీకరించే యువతను కొంతమందిని గుర్తించడం జరిగిందని వారి తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. ఆదర్శవంతమైన సమాజాన్ని తయారు చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు త్వరలో పీస్‌ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి పీస్‌ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు ఇతర అధికారులు మరియు హిందూ, ముస్లిం కుల పెద్దలు మాట్లాడుతూలి గజ్వేల్‌ పట్టణం పరిసర ప్రాంతాల్లో హిందూ ముస్లింలు అన్ని పండుగలు కలిసి చేసుకుంటామని ఎవరికి ఏ ఆపద వచ్చిన వారి ఇంటికి వెళ్లి పరమార్శించడం మరియు ఆర్థిక సహాయం చేయడం ఒక అలవాటుగా ఉందని తెలిపారు. మతాలకు కులాలకు అతీతంగా బతకడం గజ్వేల్‌ పట్టణ ప్రజల ఆనవాయితని తెలిపారు. హిందూ ముస్లిం భాయి భాయి గా ఉంటూ ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవడం జరిగిందన్నారు. గజ్వేల్‌ పట్టణంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఒకరికొకరం గౌరవించుకుంటూ అన్నదమ్ముల వలె కలిసి ఉంటామని తెలిపారు. గజ్వేల్‌ లో ఏవైనా విచ్ఛిన్నకర శక్తులు ఉంటే వెంటనే అధికారులకు తెలియ పరుస్తామని తెలిపారు గజ్వేల్‌ పట్టణంలో దసరా రంజాన్‌ బక్రీద్‌ హనుమాన్‌ జయంతి వినాయక చవితి పండు గలప్పుడు అందరము కలిసి చేసుకుంటామని తెలిపారు అందరం కలిసి గజ్వేల్‌ పట్టణ అభివృద్ధికి పోటీ పడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవ రెడ్డి, ఎఫ్డిసి చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ నేతి రాజమౌళి గుప్తా, వైస్‌ చైర్మన్‌ జెకియోద్దీన్‌, జడ్పిటిసి మల్లేశం, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, ఎంపీపీ అమరావతి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ భాస్కర్‌, గడ అధికారి ముత్యంరెడ్డి, గజ్వేల్‌ ఏసిపి రమేష్‌, స్థానిక కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు వివిధ మతాల కుల పెద్దలు ప్రజలు ప్రజా ప్రతినిధులు మున్సిపల్‌ అధికారులు గజ్వేల్‌ సిఐ జాన్‌ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు