- గౌడ జనాక్కుల పోరాట సమితి ఎ రాజకీయ పార్టీ కి అనుబంధం కాదు
- రాజకీయాలకు అతీతంగా మోకుదెబ్బ ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేస్తాం మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గుల్లపల్లి వెంకటేష్ గౌడ్ ను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని, గౌడ జనాక్కుల పోరాట సమితి ఎ రాజకీయ పార్టీ కి అనుబంధం కాదు అని యాదాద్రి, జనగాం, సూర్యపేట మూడు జిల్లాల నాయకులు కార్యకర్తలు తెలిపారు. శనివారం ఆలేరు మండలంలోనీ శారాజిపేట ఫంక్షన్ హాల్ లో యాదాద్రి జిల్లా, జనగాం జిల్లా, సూర్యపేట జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ములుగురి యాకన్న గౌడ్ గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) రాష్ట్ర కార్యదర్శి పాల్గొనీ మాట్లాడుతూ గౌడుల స్థితిగతులు వారి అభివృద్ధి కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా గౌడులను ఏకధాటి మీదికి తీసుకువచ్చి గౌడుల అభివృద్ధి కోసం పాటుపడుతూ జనగామ జిల్లాను సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అమరవేణి నరస గౌడ్ (మోకుదెబ్బ) జాతీయ రాష్ట్ర అధ్యక్షులు బి.జె.పి పార్టీలో ఉండకూడదని అన్నందున ములుగురు యాకన్న గౌడ్ ను కొన్ని నెలల క్రితం గుల్లపల్లి వెంకటేష్ గౌడ్ ను నోటీసులు ఇవ్వకుండా పిలిచి మాట్లాడకుండ ఇండ్లల్లా కు వస్తానని బెదిరింపులకు గురి చేసి వారి స్థానంలో కొత్త వ్యక్తులను సంఘం కమిటీలు వేయడాన్ని ఖండిస్తున్నాం అని, గౌడ జనా హాక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) మారోజు వీరన్న ఆధ్వర్యంలో ఏ రాజకీయ పార్టీలకు అతీతంగా గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) రాష్ట్ర మొదటి అధ్యక్షులు వెలికట్టే విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. తరువాత అనేక పోరాటాలు చేసి గౌండ్ల రక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అని దానిలో భాగంగానే కేంద్ర రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఉండాలని అప్పటినుండి ఇప్పటివరకు ప్రతి సమావేశంలో మాట్లాడుకోవడం జరుగుతుంది అని, కానీ అమరవేణి నరస గౌడ్ కేంద్ర రాష్ట్ర అధ్యక్షులు బిజెపి నాయకులు అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీలో చేరడం బిజెపి అనుబంధ సంస్థ అయిన ఓబిసి రాష్ట్ర అధికార ప్రతినిధిగా పదవి తీసుకోవడం (మోకుదెబ్బ) సంఘం కు వ్యతిరేకంగా భావిస్తున్నాం అని తక్షణమే బిజెపికి లేదా (మోకుదెబ్బ)కు రాజీనామా చేసి గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) ఆలోచన విధానాన్ని కాపాడాలని తెలియజేస్తున్నాం అని అన్నారు లేనియెడలో ధర్మాజీపేట గ్రామము ఖానాపూర్ మండల్ నిర్మల్ జిల్లా నుంచి రాజకీయాలకు అతీతంగా గౌడ జనాక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేస్తామని తెలియజేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా, జనగామ జిల్లా సూర్యాపేట జిల్లా ముఖ్య నాయకులు ములుగురి యాకన్న గౌడ్, గుల్లపల్లి వెంకటేష్ గౌడ్, నర్సింగ్ వెంకటేశ్వర్లు గౌడ్, దూడల లక్ష్మణ్ గౌడ్, దూడల వీరస్వామి గౌడ్, దూడల బిక్షపతి గౌడ్, కార్పోతుల మహేష్ గౌడ్, మొగుళ్ళ కుమార్ గౌడ్, గుడిశాల రాజు గౌడ్, మేకపోతుల నరసింహులు గౌడ్, సూదగాని రాజయ్య గౌడ్, బండి సత్యనారాయణ గౌడ్, కాసారం యాదయ్య గౌడ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
తప్పక చదవండి
-Advertisement-