Sunday, May 19, 2024

హత్యలకు దారి తీస్తున్న ధరణి పోర్టల్..

తప్పక చదవండి
  • తమ్ముడిని హత్య చేయడానికి పెదనాన్న కొడుకుల కుట్ర..
  • మృత్యుఒడి నుంచి బయటపడి ప్రభుత్వ ఆసుపత్రిలో
    చికిత్స పొందుతున్న కేతావత్ సేవ్లా..
  • పిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటున్న
    బాధిత కుటుంబ సభ్యులు..

ధరణి పోర్టల్ వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.. బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది.. ఇప్పటి వరకు ఇరు వర్గాల మధ్య ఘర్షణలు, హత్యలకు దారితీసిన సంఘటనలు అనేకానేకం చూశాం.. ఇప్పుడు సొంత అన్నదమ్ముల బిడ్డల మధ్యే వైరం ఏర్పడ్డ దారుణ సంఘటన వెలుగు చూసింది.. రక్త సంబంధీకులే ధరణిలో ఏర్పడ్డ సమస్యవల్ల శత్రువులుగా మారిన వైనం హృదయాలను కదిలించి వేస్తోంది.. అనురాగాలు, ఆప్యాయతలు మృగ్యం అవుతున్నాయి.. ఆత్మీయత అనే పదం కనుమరుగయ్యే ప్రమాదాన్ని సృష్టించింది ధరణి పోర్టల్..

తెలంగాణ రాష్ట్రం, నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట మున్సిపాలిటీలోని, గుంపెన్ పల్ల తండాలో ధరణి పోర్టల్ రెండు కుటుంబాల మాదే వివాదం జరుగుతోంది.. ధరణిలో జరిగిన అవక తవ్వకల వల్ల అన్నదమ్ముల మధ్య హత్యలు చేసుకునే పరిస్త్త్తులకు దారి తీసింది.. సర్వే నెంబర్ 8, 9 లలో ఉన్న భూమి రికార్డుల ప్రకారం ఒకరి భూమి ఒకరికి వచ్చిందని, కేతావత్ దాశ్య, వారి కొడుకులు కేతావత్ శంకర్, కేతావత్ రవి, కేతావత్ రమేష్ వీరందరూ కలిసి సొంత తమ్ముడు అయిన కేతావత్ కాశ్యా, అతని కొడుకు వికలాంగుడైన కేతావత్ సేవ్లాను చంపడానికి కుట్ర చేసి, పొలంలో ఉన్నటువంటి బోరు మోటారు యొక్క స్టార్టర్ కి కనిపించని సన్నని వైరు తీగలు స్టార్టర్ ఓపెన్ చేసే క్లిప్పులకు కనెక్షన్ ఇవ్వడం జరిగింది.. ఇది తెలియని సేవ్లా నాయక్ బోరు మోటార్ వెయ్యదానికి వెళ్లి మోటార్ ఆన్ చేయగానే.. అతనికి కరెంట్ షాక్ కొట్టింది.. ఈ ప్రమాదం నుంచి సేవ్లానాయక్ ముత్యువునుండి బయటపడి ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. జరిగిన విషయాన్ని అచ్చంపేట పోలీసులకు సేవ్యా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు