Saturday, July 27, 2024

ఈనెల 19 న కేంద్ర అఖిలపక్ష సమావేశం..

తప్పక చదవండి
  • ఉమ్మడి పౌర సంస్కృతి బిల్లుపై చర్చించే అవకాశం..
  • వాడి వేడిగా సమావేశాలు జరిగే అవకాశం..

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఏకమవుతుండటంతో ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. ఈ సమావేశాల్లో యూసీసీతోపాటు మరికొన్ని కీలక బిల్లులను ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, దేశ రాజధాని నగరం ఢిల్లీ ప్రభుత్వ సవరణ ఆర్డినెన్స్‌లను ప్రవేశపెట్టవచ్చు. యూసీసీని ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీనిని కాంగ్రెస్, డీఎంకే వ్యతిరేకిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినప్పటికీ, ఆ పార్టీ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బీజేపీపై మండిపడ్డారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ మతం గురించి మాట్లాడటం బీజేపీకి అలవాటు అయిపోయిందని దుయ్యబట్టారు. యూసీసీపై జూలై 3న జరిగిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో కాంగ్రెస్, డీఎంకే ఉమ్మడి పౌర స్మృతికి వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరిని ప్రదర్శించాయి. బీఆర్ఎస్ ఎటువంటి వైఖరిని వెల్లడించలేదు. బీఎస్‌పీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ దీనికి మద్దతు పలుకుతున్నాయి. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన స్పందిస్తూ మొదట లా కమిషన్ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేసింది. బీజేపీ నేత, పార్లమెంటరీ ప్యానెల్ చైర్మన్ సుశీల్ కుమార్ మోదీ మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాలు, గిరిజన ప్రాంతాలకు దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. రాజ్యాంగంలోని 6వ షెడ్యూలు, అధికరణ 371 ప్రకారం వీరికి రక్షణ ఉందని తెలిపారు. యూసీసీపై లీగల్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్, లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్, లా కమిషన్ అభిప్రాయాలను ఈ ప్యానెల్ స్వీకరించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు