Saturday, May 18, 2024

గులాబీ గుండెల్లో… గునపం తీర్పులు

తప్పక చదవండి
  • మంత్రికి షాక్..
  • కొత్తగూడెం ఎమ్మెల్యేకు చావు దెబ్బ
  • ఎన్నికల వేళ తలదించుకునే పనులు
  • ముందే చెప్పిన ‘ఆదాబ్ హైదరాబాద్ ‘
  • అందుకే 11కేసులు.!

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు ‘ఆదాబ్ హైదరాబాద్’కు ప్రత్యేకం)

తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఒక్క ఓటరు మాత్రమే ప్రశ్నించాడు. అదే ‘ఆదాబ్ హైదరాబాద్ ‘మాత్రమే వెలుగులోకి తెచ్చింది. అంతే.. అధికార మదం ‘తోక తొక్కిన కోతి’లా ఎగిరింది . మెయిన్ మీడియా అన్నీ మూసుకొని చోద్యం చూస్తుండగా.. హత్యాపథకాల కేసు, ఆయుధాలతో బెదిరించిన అక్రమ కేసు.. ఇలా పెట్టుకుంటూ పోయారు. ఇప్పుడేం అయింది రా..! నీచుల్లారా.. హైకోర్టు తీర్పుతో ‘నవ నాడులకు పక్షపాత ఎయిడ్స్ రోగం వచ్చినట్లు ఉందా.! ‘ఆదాబ్ హైదరాబాద్ ‘పై అక్రమ కేసులు పెట్టినప్పుడు ఈ ‘దృశ్యం సినిమా ‘ మీ ముందుంటుందని మీరు ఊహించలేదు. 2019, సెప్టెంబర్ 21 నాడే ఊహించాం ఇదే మీ బతుకుని. ఇప్పుడు చెప్పండ్రా.. మీ అసలు బతుకు.

- Advertisement -

తెలంగాణలో ఒకరు మంత్రి, మరొకరు కండువా కప్పుకున్న ఎమ్మెల్యే. రాజ్యాంగ పరంగా ఇద్దరూ ఘోర అవమానితులే.! ఈ విషయాలను బయటపెట్టిన జర్నలిస్టులపై కేసులు పెట్టిన ప్రభుత్వానికి అంతకంటే మించిన అవమానం. నీచుల్లారా.. మీ బతుకులు ఇంతే.! చెపితే వినరు. ఎదురు కేసులు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ అవమానాలు తెరకెక్కించుకుంటే మంచిది. అఫిడవిట్ల విషయంలో సొంఠి ఈ నాయకులు.. ఏం చెప్పినా అది దొంగ నాటకమే.! ఇకనైనా మారకుంటే.. వచ్చే ఎన్నికల్లో మీ బతుకులు బజారున పడ్డ ‘మందు లేని రోగుల దీనావస్థే’…! నీచుల్లారా..! ఈ ఇద్దరి బాగోతంపై ‘ఆదాబ్ హైదరాబాద్ ‘ అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఛీ..ఛీ.. నువ్వు ఎమ్మెల్యేవి కాదు ఫో..

  • వనమాకు రూ. 5 లక్షల జరిమానా
  • 2018 నుంచి ఎమ్మెల్యేగా ‘జలగం’ను ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు
    కొత్తగూడెం అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ పత్రంలో ఎమ్మెల్యే వనమా తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్నికల కమిషన్ ని మోసం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు గతంలో హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా మంగళవారం హైకోర్టు అనర్హత పిటిషన్ పై మాజీ ఎమ్మెల్యే జలగంకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వనమా ఎన్నిక రద్దు చేస్తూ, వనమాకు రూ. 5 లక్షల జరిమానా, 2018 నుంచి ఎమ్మెల్యేగా జలగంను ప్రకటిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

అబద్దాల మంత్రికి హైకోర్టులో..
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కుదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ శ్రీనివాస్‌గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మంత్రి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించారంటూ మహబూబ్‌నగర్‌ ఓటర్ రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగే అర్హత లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌కు అర్హత లేదని పిటిషన్‌ను కొట్టివేయాలని శ్రీనివాస్ గౌడ్ మరో పిటిషన్‌ వేశారు. దీనిపై ఇప్పటికే హైకోర్టులో ఇరువాదనలు పూర్తి అవగా.. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ కొట్టివేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. పిటిషనర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం అనుమతించింది.

అసలేం జరిగింది :
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నవంబర్ 13న ఒకటి, 19న మరొక నామినేషన్ సెట్ దాఖలు చేశారు. అందులో నేటి మంత్రి అనేక అబద్ధాలను అవలీలగా ఆడేశారు. అవి పొరపాటున, ఏమరపాటున జరిగినవి కావు. ఉద్దేశ్య పూర్వకంగానే ఆయన అనేక విషయాలను దాచిపెట్టారు.

అబద్దం నెం.1:
2016లో రూ. 30 లక్షల విలువైన ఫార్చ్యూన్ వాహనం (నెం. టిఎస్ 0ఇఎల్ 6666) కొనుగోలు చేశారు. ఈ వాహనం ఆగష్టు 3, 2016 నుంచి మే 21, 2019 వరకు సరిగ్గా 41 సార్లు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించారు.అందుకుగాను ఆ వాహనానికి సంబంధించి రూ.46,535లు అక్షరాలా జరిమానా కట్టాల్సి ఉంది.

అబద్దం నెం. 2:
ఇక ఆయన సతీమణి విరసనోళ్ళ శారద పేరుమీద ఉన్న ఓల్వా (నెం. టిఎస్06ఇఆర్ 6666) వాహనాన్ని 2017లో అక్షరాలా 71లక్షల 82వేల రూపాయలతో కొనుగోలు చేశారు. జులై 22, 2017 నుంచి ఏప్రిల్ 7, 2019 వరకు సరిగ్గా 14 సార్లు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించారు.
రూ.16,390లు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందకు జరిమానా కట్టాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ కు సమర్పించిన తన ఎన్నికల అఫిడవిట్ లో ‘నో డ్యూస్’ అని స్పష్టంగా పేర్కొన్నారు. ఉద్దేశ్య పూర్వకంగా ఈ జరిమానాలు కట్టకుండా… ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేవని చెప్పారు.

అబద్దం నెం. 3లో
అమాత్యుల వారూ.. ఆస్తులూ దాచారు..:
మంత్రి శ్రీనివాస్ తన సతీమణి ఆస్తులను (డాక్యుమెంట్ నెంబర్లు 7703/2014, 7704/2014, 143/2015) కలిగి ఉన్నారు.

అబద్ధం నెం 4:
ఈ ఆస్తులు తనఖా పెట్టి మహబూబ్ నగర్ లోని పద్మావతి కాలనీలో గల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ లో (డాక్యుమెంట్ నెం. 3331/ 2016, అకౌంట్ నెం. 73118697869) మార్టిగేజ్ లోను పొందారు. ఈ విషయాన్ని ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు.

అబద్ధం నెం.5:
వాహనాల లోను ఉంది:
అలాగే నెలవారీ చెల్లించే వాహన లోను రూ.8,44,000ల వివరాలను కూడా ఆయన దాచారు. ఆ లోను జనవరి28, 2019న కట్టారు. అంటే ఎన్నికల అఫిడవిట్ లో ప్రస్థావించలేదు.

అబద్ధం నెం.6:
మంత్రి పేరుతో ఉన్న వాహనం ఫార్చ్యూన్ వాహనం (టిఎస్06 ఇఎల్ 6666) లోను హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ లో 5 నెలల బకాయిలు రూ. 4,39,680లు ఉంది. ఈ విషయం కూడా రహస్యంగా ఉంచారు.

ముందు దాచి.. తర్వాత చెప్పి..:
హైదరాబాద్, జిహెచ్ఎంసీ, ఎస్బీహెచ్ శాఖలోని ఎకౌంటు నెంబర్ 62011824209 మొదటి అఫిడవిట్ లో చెప్పలేదు. ఈ విషయాన్ని ఫిర్యాదు అందిన తర్వాత రెండో అఫిడవిట్ లో సరిచేసుకున్నారు. అలాగే ఆయన సతీమణికి ద్యుతీ మీడియాలో 60వేల విలువైన షేర్ల విషయాన్ని మొదట దాచి, తర్వాత వెల్లడించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు