Sunday, September 8, 2024
spot_img

ప్రధాని మోడీకి కళ్లు మూసుకుపోయాయి.. తెలంగాణ అభివృద్ధి కనుపడట్లే

తప్పక చదవండి
  • కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం 40 శాతం కరప్షన్ కు పాల్పడుతుందని ప్రజలు గద్దె దించారు.
  • ప్రధాని మోడీ ..ప్రతిపక్ష పార్టీలు కరప్షన్ కు పాల్పడుతున్నాయని చెప్పడం సిగ్గుచేటు..
  • 20 వేల కోట్ల లోకోమోటివ్ ఫ్యాక్టరీ తన్నుకుపోయిన ప్రధాని..
  • రూ. 520 కోట్ల రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం ఏంటి..?
  • ఘాటు విమర్శలు చేసిన సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్‌..

వ‌రంగ‌ల్ జిల్లా వేదిక‌గా తెలంగాణ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా కొన‌సాగిన ప్ర‌ధాని మోడీ ప్ర‌సంగంపై హైదరాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్‌ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల 45 ఏళ్ల కల..దానిని తన్నుకుపోయి..ఇప్పుడు రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ కు శ్రీకారం చుట్టి తెలంగాణకు ఏదో గొప్ప వరం ఇచ్చినట్లు చెప్పడం సిగ్గుచేటు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ని గెలిపించుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటుంటే.. ప్రధాని మోడీ మాత్రం తెలంగాణ సర్కార్ కరప్షన్ కు పాల్పడుతుందని అనడం సిగ్గుచేటు. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం 40 శాతం కరప్షన్ కు పాల్పడుతుందని ప్రజలు గద్దె దించారు. అది చూసిన తర్వాత కూడా ప్రధాని మోడీ ..ప్రతిపక్ష పార్టీలు కరప్షన్ కు పాల్పడుతున్నాయని చెప్పడం సిగ్గుచేటు. ఈరోజు బిజెపి ప్రభుత్వాలు కరప్షన్ కు పాల్పడుతున్నాయా..? తెలంగాణ ప్రభుత్వం పాల్పడుతుందా..? అనేది దేశ ప్రజలకు తెలుసు. ప్రధాని మోడీ మాట్లాడడానికి కాస్త ఇంగితం ఉండాలి.

ఈ రోజు తెలంగాణ అంటే భారత దేశానికే తలమానికంగా ఉంది. వరి ఉత్పత్తిలో గాని, కరెంట్ వినియోగంలో గాని, ఉత్పత్తిలో గాని ఇలా ఎందులో చూసిన తెలంగాణ నెం వన్ స్థానంలో ఉండేలా కేసీఆర్ చేసారు. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, మన ఊరు – మన బడి, రైతుబంధు, దళిత బంధు, బస్తి దవాఖాన, మిషన్ భగీరధ ఇలా ఎన్నో పధకాలు తెచ్చి తెలంగాణను అభివృద్ధి చేస్తుంటే.. ప్రధాని మోడీకి కళ్లు ముసుకపోయాయా..? ఈ అభివృద్ధి మోడీకి కనిపించడం లేదా..? అని దాసోజు శ్రావణ్ ప్రశ్నించారు. ఉద్యోగాల కామన్ రిక్రూట్‌మెంట్‌ బిల్లును పక్కన పెట్టి ఇప్పుడు యూనివర్సిటీలో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని మోడీ చెప్పడం విడ్డూరంగా ఉందని నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి మోడీ కేవలం ఇక్కడి ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేలడం, అసత్యాలు మాట్లాడడం అలవాటుగా మారిందన్నారు. మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయగలరో చెప్పకుండా, ఉపన్యాసం ఇచ్చి ఉత్త చేతులతో వెళ్లిపోవడం పరిపాటిగా మారిందన్నారు. 20 వేల కోట్ల లోకోమోటివ్ ఫ్యాక్టరీని తరలించుకుపోయిన మోడీ సబ్ కా సాత్ , సబ్ కా వికాస్ అనే నినాదం.. గుజరాత్ కా సాత్, గుజరాత్ కా వికాస్‌గా మారిపోయిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం గత తొమ్మిది సంవత్సరాలలో అడిగిన బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ పునః ప్రారంభం, తెలంగాణలోని జాతీయ రహదారి ప్రాజెక్టుల నుంచి మొదలుకొని, నూతన రైల్వే లైన్లు ఏర్పాటు, రైల్వే లైన్ల బలోపేతం వంటి అన్ని రకాల డిమాండ్లను పక్కన పెట్టిన మోడీ తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని, వివక్షను రాష్ట్ర ప్రజలను గమనిస్తున్నారని, సరైన సమయంలో బీజేపీకి గుణపాఠం చెప్పడం ఖాయమని శ్రావణ్ హెచ్చరించారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల 20 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న విషయాన్ని దాచిపెట్టి, కేంద్ర ప్రభుత్వంలో దాదాపు 16 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను నింపకుండా, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగాలను శాశ్వతంగా ప్రైవేటుపరం చేస్తున్న ప్రధానమంత్రి తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైన మాట్లాడడం గురువింద సామెత కన్నా హీనంగా ఉందన్నారు. కేవలం అదానీ సంస్థలకే దోచిపెడుతూ ..ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తున్నాడు మోడీ. తెలంగాణ యువతకు లక్షలాది ఉద్యోగాలను అందించే అవకాశం ఉన్న ఐటిఐఆర్ ప్రాజెక్టును ప్రభుత్వంలోకి రాగానే రద్దు చేసిన మోడీ ఇక్కడి ఉన్నత విద్యావంతులకు చేసిన మోసాన్ని ఎన్నటికీ తెలంగాణ యువత మరిచిపోద‌ని, తెలంగాణ వ్యతిరేఖి మోడీ అని శ్రావణ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ పని అని వాపోతున్న మోడీ..అబద్దాల పునాదుల మీద రాజకీయాలు చేసే మోడీని కెసిఆర్ ఏనాడూ పట్టించుకోలేదు. నిధులు ఇవ్వకున్నా, అనేక సందర్భాలలో అభివృద్ధి జరుగకుండా మోకాలు అడ్డం పెట్టినా, మొక్కవోని ధైర్యంతో కెసిఆర్ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపినారు. ఆఖరికి తిరుపతి వేంకటేశ్వర స్వామిని సైతం మోసం చేసిన మోడీ, తెలంగాణ ప్రజలను కూడా మోసం చేసే కుట్ర చేస్తుండు. ఏడుకొండల సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తానని ఎందుకు మాట తప్పాడని మోడీని ప్రశ్నించారు శ్రావణ్. అదేవిధంగా తెలంగాణను మోసం చేసేందుకు సిద్ధం అయ్యిండు. మోడీ గురించి ఆలోచించే వ్యక్తి కాదు కేసీఆర్..దేశ ప్రజల బాగుగోలు కోసం ఆరాట పడే వ్యక్తి కేసీఆర్ అని శ్రావణ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి మోడీ వల్ల కాదు కేసీఆర్ గొప్ప‌త‌నం వ‌ల్లే పెట్టుబ‌డులు వ‌స్తున్నాయి అని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌పై ప్రేమ ఉంటే మాకు రావాల్సిన డ‌బ్బులు, ఫ్యాక్టరీలు , ఉద్యోగాలు ఇవ్వండి అని డిమాండ్ చేశారు. నీతి ఆయోగ్ చెప్పినా డ‌బ్బులు ఇవ్వ‌లేదని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధిని మోడీ ప్ర‌భుత్వం అడ్డుకుంటోంది అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు