Monday, May 20, 2024

గిన్నిస్ వరల్డ్ రికార్డు..

తప్పక చదవండి
  • అరుదైన ఘనత సాధించిన జనరల్ ఇన్సూరెన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా
    (జిఐఎఫ్ఐ) వద్ద బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్

భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలలో ఒకటైన బజాజ్ జనరల్ అలియంజ్ ఇన్సూరెన్స్ 3జులై, 2023 న మొట్టమొదటి జనరల్ ఇన్సూరెన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (జిఐఎఫ్ఐ)ని నిర్వహించింది.. ఒక ఇన్సూరెన్స్ కాన్ఫరెన్స్‌లో అత్యధిక హాజరుతో ఇది అధికారికంగా కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించింది. రికార్డుస్థాయిలో 5235 వ్యక్తులు ఈ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.. వీరు ఇన్సూరెన్స్ పరిశ్రమలో ప్రపంచ వ్యాప్తపు చరిత్ర సృష్టించేందుకు దోహదపడ్డారు. జిఐఎఫ్ఐ యొక్క ప్రధాన ఈవెంట్‌లో ఈ సరికొత్త రికార్డు ప్రకటించబడింది.

సంస్థ గతంలో జిఐఎఫ్ఐ అవార్డులను గురించి ప్రకటన చేసింది.. అప్పుడు వారు ఇన్సూరెన్స్ పరిశ్రమలో అత్యుత్తమ ర్యన్క్ పొందిన హెల్త్, జనరల్
ఇన్సూరెన్స్ అడ్వైజర్లను గుర్తించేందుకు నామినేషన్లను ఆహ్వానించారు. తదనంతరం, జిఐఎఫ్ఐ అవార్డుల కోసం అడ్వైజర్లు వారి నామినేషన్లను సమర్పించారు. ప్రకటించిన ఐదు విభాగాల్లో 2000 కంటే ఎక్కువ ఎంట్రీలతో అద్భుతమైన ప్రతి స్పందన లభించింది. ఒక స్వతంత్ర ప్రాసెస్ వ్యూవర్, థర్డ్-పార్టీ న్యాయమూర్తుల బృందం నిర్వహించిన కఠినమైన మదింపు ప్రక్రియ ఆధారంగా, జనరల్ ఇన్సూరెన్స్ రెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రతి విభాగం కోసం విజేతలు, రన్నరప్‌లను సంస్థ ప్రకటించింది.. వారిని సత్కరించింది.

- Advertisement -

ఈ కార్యక్రమానికి బజాజ్ ఫైన్ సర్వీసెస్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ బజాజ్ హాజరయ్యారు. వీరితో పాటు చారుకౌశల్ – సిఇఒ, అలయన్స్ పార్ట్నర్ ఇండియా మాథ్యూ స్టాల్గిస్ – ఎపిఎసి రీజినల్లీడర్ – బ్రోకర్, క్లయింట్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ హెల్త్ డాక్టర్ ఆరోకియ స్వామి వేలుమణి, థైరాయిడ్ కేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ స్థాపకుడు, చైర్మన్, ఎండి గణేష్ మోహన్, సిఇఒ, బజాజ్ ఫైన్ సర్వ్ అసెట్ మేనేజిమెంట్ లిమిటెడ్, విజేంద్ర కటియార్, కంట్రీహెడ్-ట్రెండ్ మైక్రో ఇండియా, సార్క్ విశాల్ గోండాల్ – ఇన్‌ఫ్లుయెన్సర్, స్థాపకుడు, సిఇఒ, జీఓక్యు ఐ ఐ నిషా నారాయణన్ – సిఒఒ, డైరెక్టర్, రెడ్ ఎఫ్.ఎం., మ్యాజిక్ ఎఫ్.ఎం. స్టీవ్వాట్కిన్స్ – సిఇఒ గ్రేటర్ సౌత్ ఈస్ట్ ఏషియా లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా.. పివిఎస్ఎం, యువైఎస్ఎం, ఎస్ఎం, విఎస్ఎం, దేవాంగ్ మోడీ, సిఇఒ – బజాజ్ ఫిన్ సర్వ్ హెల్త్ పరిశ్రమ ప్రముఖులు కూడా పాల్గొన్నారు..

కేటగిరీ వారీగా జిఐఎఫ్ఐ అవార్డుల విజేతలు, రన్నరప్‌ల జాబితా :

  1. భారతదేశంలో ఉత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ – విజేత మయాంక్ చందర్ కొఠారీ, ‌అహ్మదాబాద్.. రన్నరప్ షకీల్ అహ్మద్, ముంబై
  2. భారతదేశంలో ఉత్తమ మోటార్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ – విజేత శివ్ కుమార్ గుప్తా, వారణాసి.. రన్నరప్ గౌరవ్ శర్మ, ఢిల్లీ
  3. భారతదేశంలో ఉత్తమ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అడ్వైజర్ – విజేత ప్రియదర్శిని శేషాద్రి, బెంగళూరు.. రన్నరప్ బిపిన్ కుమార్ పటేల్, మెహసానా
  4. భారతదేశంలో ఉత్తమ మల్టీలైన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ – విజేత ప్రశాంత్ షా, ముంబై.. రన్నరప్ చారు భారతి, ఢిల్లీ
  5. భారతదేశంలో ఉత్తమ మహిళా ఇన్సూరెన్స్ అడ్వైజర్ – విజేత ప్రీతి సమీర్ షా, ముంబై.. రన్నరప్ కరిష్మా ఛాబ్రా, ఢిల్లీ

ఈ సందర్భంగా బజాజ్అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ తాపం సింఘేలా మాట్లాడుతూ.. “ఇన్సూరెన్స్ సమాజంపై అపారమైన సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.. కానీ, దానికి తగిన గుర్తింపును పొందలేదు. పండుగలు అనేవి చర్చలకు అవకాశాన్ని కలిపిస్తాయి.. జిఐఎఫ్ఐ లాంటి ఒక పండుగ ఇన్సూరెన్స్‌ను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడానికి, ఎక్కువ మంది ప్రజలను ఇన్సూరెన్స్ రక్షణ పరిధిలో చేర్చడానికి, ఇన్సూరెన్స్ రంగంలో వస్తున్న కొత్త ఉత్పత్తులను ప్రదర్శించడానికి సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోగలదు అనే ముఖ్యమైన అంశాలను చర్చించేందుకు ఒక వేదికను మీకు అందిస్తుంది అని మేము భావించాము. దీనిని దృష్టిలో ఉంచుకుంటూ, మేము చొరవ తీసుకొని జిఐఎఫ్ఐని ప్రారంభించాము. ఇక్కడ పరిశ్రమకు చెందిన నిపుణులు ఇన్సూరెన్స్ ప్రోడక్టులు, సర్వీసులు, వివిధ అంశాలను గురించి ప్రసంగించారు. ఒక ఇన్సూరెన్స్ కాన్వారెన్స్ లో అత్యధిక హాజరును నమోదు చేసిన కార్యక్రమంగా సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డును జిఐఎఫ్ఐ సాధించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. బ్యాజిక్ భారత దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త ప్రమాణాలను సృష్టిస్తుంది.. సమాజంలో మార్పును తెచ్చిపెడుతూనే, పరిశ్రమలోనూతన ఒరవడిని సృష్టిస్తూ ఈ ప్రయాణాన్ని మేము మందుకు కొనసాగిస్తాము.

జనరల్ ఇన్సూరెన్స్ ప్రరిశ్రమలో అగ్రగామిగా ఉన్నవారిని ఒకవేదికపైకి తీసుకురావాలి అనే ఆలోచనతో జిఐఎఫ్ఐ ప్రారంభం అయింది.. సమాజ శ్రేయస్సు కోసం ఈపరిశ్రమ చేసిన కృషిని గుర్తిస్తుంది. జిఐఎఫ్ఐ యొక్క ప్రారంభ అధ్యాయం అద్భుతమైన విజయం సాధించింది.. ప్రారంభం నుండి జిఐఎఫ్ఐ అద్భుతమైన ప్రతిస్పందనను అందుకుంది. వక్తలు, ప్రదర్శన కళాకారులు, ఆడియెన్స్, విజేతల ఉత్సాహం, ఉత్సుకత అద్భుతంగా ఉన్నాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని, సమయం గడిచే కొద్దీ జిఐఎఫ్ఐ మరింత విస్తరిస్తుంది అని బలంగా విశ్వసిస్తున్నాము. ఒక పరిశ్రమగా ప్రజల జీవితంలో మంచి విలువలను జోడించడానికి, సమాజం, మన దేశంపై చిరకాల ప్రభావాన్ని చూపడానికి మనమందరం కలసికట్టుగా కృషిచేద్దాం.” అని పిలుపు నిచ్చారు..

కమెడియన్ సునీల్ గ్రోవర్ అద్భుతమైన ప్రదర్శన, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ప్రీతం యొక్క ఉత్సాహభరితమైన సంగీత కార్యక్రమంతో సహా అనేక ఇతర అద్భుతమైన ప్రదర్శనలతో అడ్వైజర్లు, అతిథులు, హాజరైన ఇతర వ్యక్తులకు ఈవేడుకను ఒక మరపురాని అనుభవాన్నిమిగిల్చింది. ఈ ఈవెంట్ ఫొర్చె, మెక్లారెన్ ఆటోమోటివ్, ల్యంబర్గిని లాంటి తయారీదారులను కలిగి ఉన్నఒక ఆటో మొబైల్ జాన్ లాంటి వివిధ ఆకర్షణలను కలిగి ఉంది. ఇన్సూరెన్స్ పరిశ్రమ పట్ల తమ సహకారానికి గాను అడ్వైజర్లకు గుర్తింపును ఇవ్వడానికి ఒక వేదికను అందించిన జిఐఎఫ్ఐ కార్యక్రమం విజయవంతం అయ్యింది.. కంపెనీ తన కస్టమర్లకు అద్భుతమైన సేవలను అందించడమే కాకుండా జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ ఎదుగుదల, అభివృద్ధికి కూడా దోహదపడుతుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు