Sunday, April 28, 2024

బోనాల పండుగకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు..

తప్పక చదవండి
  • వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ డీఎస్. చౌహాన్..
  • ఎలాంటి పొరబాట్లు కలగకూడదని అధికారులకు ఆదేశాలు..
  • బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన రాచకొండ సీపీ..

బోనాల పండుగ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గురువారం ఓల్డ్ మల్కాజిగిరి మహంకాళి అమ్మవారి గుడి, సఫీల్ గూడ కట్టమైసమ్మ గుడిని రాచకొండ సీపీ డి.ఎస్.చౌహాన్ సందర్శించారు. బోనాల పండుగ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడం వల్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను రాచకొండ సీపీ ఆదేశించారు. మల్కాజిగిరిలో ఆదివారం, సోమవారం జరగబోయే బోనాల ఉత్సవాల సందర్భంగా ఓల్డ్ మల్కాజిగిరి మహంకాళి అమ్మవారి గుడి, సఫీల్ గూడ కట్టమైసమ్మ గుడిని సీపీ చౌహన్ సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. బోనాల పండుగ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడం వల్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సాధారణ భక్తులకు ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. మహిళా భక్తులు, పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆలయ ఆవరణలో వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయడానికి తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. షీ టీం బృందాలు కూడా మహిళా భక్తుల రక్షణ కోసం విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. భక్తులు పోలీసు వారికి సహకరించాలని, సంతోషంగా బోనాల పండుగ జరుపుకోవాలని ఆకాక్షించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు