Thursday, February 29, 2024

ప్రజల లైఫ్ లను కాలరాస్తున్న హెర్బల్ లైఫ్..

తప్పక చదవండి
  • న్యూట్రీషన్ ప్రోడక్ట్ పేరుతో రసాయనాలు కలిపిన మందు తాగిస్తున్న వైనం..
  • ప్రతి వ్యక్తి దగ్గర రూ. 6900 వసూలు చేస్తున్న దుర్మార్గం..
  • ఎలాంటి అనుమతులు లేకుండా రిఫెరల్ బిజినెస్ పద్దతిలో మల్టీ లెవల్ మార్కెటింగ్..
  • వైద్యాన్ని వ్యాపారం చేస్తున్న హెర్బల్ లైఫ్ కంపెనీ..
  • ఫిర్యాదు చేసి మూడు నెలలు గడుస్తున్నా చర్యలు చేపట్టని ఆయుష్ డిపార్ట్మెంట్..
  • ఆయుష్ డిపార్ట్మెంట్ అధికారులకు మామూళ్లు అందుతున్నాయన్న అనుమానాలు.. !
  • డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ కి ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త..

కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా కొందరు మానవత్వాన్ని మరచి పోతున్నారు.. ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకునే అమాయకులను టార్గెట్ చేస్తున్నారు.. తమ ఆరోగ్యాలు బాగుపడతాయని నమ్మకంతో మార్కెట్ లో ఎలాంటి కొత్త ప్రోడక్ట్ వచ్చినా.. ఏమీ ఆలోచించకుండా గుడ్డిగా దానివెంట పరిగెడుతున్నారు.. అసలు తాము వాడుతున్న మెడిసిన్ సరైన ప్రామాణికాల్లో ఉత్పత్తి అవుతోందా..? ఇలాంటి ప్రోడక్ట్ లకు ప్రభత్వం నుంచి అనుమతులు ఉన్నాయా..? అన్నది నిర్ధారించుకోకుండానే.. ఆరోగ్యాలు బాగుపడతాయనే నమ్మకంతో లక్షలు వెచ్చిస్తూ.. చివరికి తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.. ఇంగ్లీష్ మందులపై నమ్మకం సన్నగిల్లడంతో దీనిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు కొందరు వ్యాపారస్తులు.. తమ మందులు ఎలాంటి హానీ కలిగించవంటూనే.. తమ మందులు వాడుతూనే ఇతరులకు రెఫర్ చేస్తే అధిక ఆదాయం కూడా పొందవచ్చని చెబుతూ నిలువునా ముంచుతున్నారు.. మల్టి లెవల్ మార్కెటింగ్ చేస్తూ.. తమ పబ్బాన్ని గడుపుతున్నారు.. ఇలాంటి వ్యవహారమే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది.. హెర్బల్ లైఫ్ అనే కంపెనీ ఎలాంటి అనుమతులు లేకుండా, సరైన ప్రమాణాలు పాటించకుండా.. అమాయకులకు తమ కంపెనీ మందును అందిస్తోంది.. సమాచార హక్కు చట్టం ద్వారా వాస్తవాలను వెలుగులోకి తీసుకు వచ్చిన సామాజిక కార్యకర్త అందించిన దారుణమైన వాస్తవాలను మీకోసం..

కొన్ని సంవత్సరాలుగా హెర్బల్ లైఫ్ అనే కంపెనీ ద్వారా తెలంగాణలోని అన్ని జిల్లాలో హెల్త్ న్యూట్రిషియన్ అని, కొన్ని వేల న్యూటిషియన్ ప్రోడక్ట్ పేరుతో హెల్త్ న్యూట్రిషియన్ క్లబ్ అని కొన్ని రసాయనాలు కలిపి ఉదయం 7.30 గంటల నుండి 10.30 గంటల వరకు కొన్ని లక్షల మందికి తాగిస్తున్నారు.. నెలకు ప్రతి వ్యక్తి దగ్గర నుండి రూ.. 6900/-లు (అక్షరాల ఆరు వేల తొమ్మిదివందల రూపాయలు) వసూలు చేస్తూ.. హెర్బల్ ప్రోడక్ట్స్ ని అందులో రుచి వచ్చేటట్లు గుర్తు తెలియని కొన్ని ద్రవరూప రసాయనాలు కలిపి సామాన్య జనాలకు త్రాగిస్తున్నారు. న్యూట్రిషియన్ క్లబ్ లో జాయిన్ కండి.. మీరు ఇంకొకరిని జాయిన్ చేయండి… అని రిఫరల్ బిజినెస్ పద్ధతిలో మల్టీలెవల్ మార్కెటింగ్ వ్యాపారాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు..

- Advertisement -

ఈ విధంగా కొన్ని లక్షల మంది దగ్గర తెలంగాణలో కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు.. ఒక్కొక్క క్లబ్ లో 100 మంది నుండి 140 మంది వరకు జాయిన్ చేసుకొని.. బిపి, షుగర్, వెయిట్ లాస్ అని ప్రజలను మోసం చేస్తున్నారు.. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో హెర్బల్ ఫుడ్ ప్రోడక్ట్ కు ఏ విధంగా అనుమతినిచ్చారో, విచారించి ప్రజాశ్రేయస్సు కోరి తగు చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త కేటీ నర్సింహారెడ్డి డిమాండ్ చేస్తున్నారు.. హెర్బల్ లైఫ్ కంపెనీ ద్రవపదార్ధాలు అని ఒక్కొక్క ప్రోడక్ట్ సుమారు రూ. 20,000 మొదలుకొని వేల రూపాయల వరకు ఉన్నాయి. ఈ విధంగా కాళ్ళ నొప్పులు, శరీర నొప్పులు, వాంతులు, విరేచనాలు కూడా ఈ హెర్బల్ లైఫ్ ద్వారా తయారు చేయబడిన మందులు వాడితే రోగాలన్నీ నయమవుతాయని న్యూట్రిషియన్ క్లబ్ ద్వారా ఉపన్యాసాలిస్తూ.. సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారు.. హెర్బల్ లైఫ్ న్యూట్రిషియన్ క్లబ్ లకు అనుమతి ఉందా లేదా..? అనే విషయంపై విచారణ జరపవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొన్నివేలమందికి న్యూట్రిషియన్ క్లబ్ పేరిట అంబాసిడర్ అని, కోచర్లు అని, వివిధ పదవులు ఇచ్చి, ప్రమోషన్లు ఇస్తున్నామని, మీరు కొంతమందిని ఈ క్లబ్ లో జాయిన్ చేస్తే 25 శాతం నుండి 50 శాతం వరకు సీనియర్లకు డిస్కౌంట్ అని మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట ప్రజలను మోసం చేస్తున్నారు.. తెలంగాణలో ఈ హెర్బల్ లైఫ్ వ్యాపారం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి అనుమతులు ఉన్నాయో..? తెలుపగలరని సమాచార హక్కు చట్టం ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ కమిషనర్ కు కోరడం జరిగింది. కమిషనర్ అందించిన సమాచారం ప్రకారం హెర్బల్ లైఫ్ కంపెనీకి రికార్డుల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రిజిస్టర్ కాలేదు.. ఎలాంటి అనుమతులు లేవు అని స్పష్టంగా తెలపడం జరిగింది.

ఇది హెర్బల్ఫ్ ప్రోడక్ట్ ఒక మత్తు పదార్ధమని (డ్రగ్స్) దీనిలో సామాన్యమైన ప్రజలకు తెలియని రసాయన పదార్ధాలు కలపడం వలన.. కొంత ద్రవపదార్ధమును రుచికరంగా తయారు చేయుచున్నారు. ఈ రుచికరమైన హెర్బల్ లైఫ్ ద్రవపదార్థాల వలన సామాన్యమైన ప్రజలు ఈ మత్తుకు అలవాటు పడి ఉదయం, రాత్రి పూట కొన్ని లక్షల మంది భోజనం తినడం కూడా మనివేసినారు. కావున వీటి పైన సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆయుష్ డైరెక్టర్ ని సామాజికవేత్త కేటీ నరసింహారెడ్డి డిమాండ్ చేస్తున్నారు..

అసలు హెర్బల్ లైఫ్ అనే కంపెనీ ఏవిధంగా తన కార్యకలాపాలను తెలంగాణ రాష్ట్రంలో కొనసాగిస్తోంది..? ఎవరి అనుమతులతో ప్రాణాంతక మందును సామాన్యులకు సరఫరా చేస్తోంది..? ఏ ప్రామాణికాలు పాటిస్తూ మందును మార్కెట్ లోకి తీసుకువెళ్తున్నారు..? మందు ధరను ఎవరు నిర్ణయించారు..? ఇంత జరుగుతున్నా అనుమతులు ఇవ్వాల్సిన ఆయుష్ డిపార్ట్మెంట్ వారు ఏమి చేస్తున్నారు..? ప్రజల ఆరోగ్యాలపై విపరీత దుష్ప్రభావం చూపే మందులను అరికట్టాల్సిన ఆయుష్ అధికారులు కూడా లంచాలకు మరిగి మిన్నకుండిపోతున్నారా..? ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న హెర్బల్ లైఫ్ కంపెనీ వెనుక దాగివున్న గగ్గురుపొడిచే వాస్తవాలను మరిన్ని వాస్తవాలతో వెలుగులోకి తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు