Monday, November 4, 2024
spot_img

ఉమ్మడి మెదక్ జిల్లాలో ధరణి తో పేదల భూములు స్వాహా..

తప్పక చదవండి
  • జిల్లాలలో ఎటు చూసినా రెవిన్యూ డిపార్ట్మెంట్లో లంచాల పర్వం
  • లావన్ పట్టా భూములను సైతం పట్టాలుగా మార్పు..
  • అడ్డగోలుగా బడా భూకబ్జాదారులకు అంటగడుతున్న వైనం..
  • రైతులు తమ గోసను తెలియజేసేందుకు కలెక్టరేట్ వెళ్తే గెంటేసిన దౌర్భాగ్యం..
  • తరతరాలుగా వారసత్వం భూమిగా పట్టా బుక్కుల్లో
    ఉన్నా ధరణి పోర్టల్ కి ఎక్కని భూమి..
  • లక్షల ఎకరాల పేదోళ్ల భూములు టార్గెట్ గా భూ బకాసురులు..
  • ఏసీబీ చేతికి చిక్కిన అధికారులు.. అధికార పార్టీ అండదండలతో
    మరింత పెద్ద పదోన్నతులకు చేరుకుంటున్నారు..
  • తాసిల్దార్ ల పనితీరుపై మండిపడుతున్న రైతాంగం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభించారు.. ప్రతి రైతుకు పట్టా పాసు బుక్కులు నూతనంగా ఉండాలని ఉద్దేశంతో.. అలాగే రైతుల భూములు పగడ్బందీగా వారి బుక్కులోనే నేరుగా ఉండే విధంగా ధరణి పోర్టల్ లో సర్వే నంబర్ ఎంటర్ చేయగానే భూమి పూర్తి వివరాలు చూపించే విధంగా రూపొందించారు.. కానీ ఈ ధరణి పోర్టల్ సామాన్య ప్రజలకు శాపంగా మారింది.. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లాలో ధరణి పోర్టల్ తో చాలా సమస్యలు నెలకొన్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఒకరి భూమి ఒకరి పేరుపై గతంలో అమ్ముకుని పోయిన రైతులు కూడా ధరణిలో మళ్ళీ తన పేరు రావడంతో ఆ రైతు భూమి తనదేనంటూ కాస్తులో ఉన్న రైతుని బ్లాక్ మెయిల్ చేస్తూ.. డబ్బులు ఇస్తేనే నీ పేరుపై మారుస్తాను అంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు కొందరు రైతులు, ఎస్టేటర్లు.. అంతే కాకుండా సిద్దిపేట జిల్లా, దుబ్బాకలో ఒక జర్నలిస్టు భూమి దాదాపు 10 గటల పట్టా భూమి వంశపారపర్యంగా పెంటం స్వామి అనే వ్యక్తికి కూడా ఇలాంటి ఎదురుదెబ్బ తగలడం చాలా బాధాకరంగా ఉందని ఆయన సోషల్ మీడియాలో ఆయన బాధను తెలియపరిచారు.. లంచం ఇస్తేనే నీ భూమి నీకు దక్కుతుందని సదరు తాసిల్దార్ ఆయనకు నేరుగా చెప్పడంతో ఆందోళన గురైన జర్నలిస్టు ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.. అయితే ఇతని భూమిని కబ్జా చేసింది అధికార పార్టీ బడా నాయకులు కాబట్టి, పెద్దల అండదండలు ఉండడంతో అతనికి న్యాయం జరగడం లేదని ఆదాబ్ దినపత్రికతో తెలిపారు.. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ప్రతిపక్షాలు అనేకమార్లు విన్నవించినా గాలికి వదిలేశారు తెలంగాణ రెవెన్యూ అధికారులు.. జిల్లా కలెక్టర్లు.. జిల్లా జాయింట్ కలెక్టర్లు.. ఆర్డీవోలు.. తాసిల్దారులు చేస్తున్న ఈ జాప్యం వలన భూముల కోసం పలుచోట్ల ఇదివరకే రైతులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు దినపత్రికలలో వస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం.. కానీ అధికారుల తీరు మాత్రం మారకపోవడంపై చర్చనీయాశంగా మారింది.. అసలు లంచాలు నేరుగా జిల్లా కలెక్టర్లు తీసుకుంటున్నారా లేదా కిందిస్థాయి సిబ్బందితో కుమ్మక్కై చేతివాటం చూపెడుతున్నారా..? అని సందిగ్ధంలో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. లావన్ పట్టా భూములను సైతం దాదాపుగా వందల ఎకరాలను పట్టా భూములుగా.. బకాసురులకు అనుకూలంగా మార్చినట్లు ఆదాబ్ దినపత్రికకు అందిన సమాచారం పూర్తి వివరాలతో మరో కథనంతో మీ ముందుకు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు