Monday, May 20, 2024

తెలంగాణలో ఘనంగా రిచ్ మాక్స్ గోల్డ్ లోన్ కంపెనీ 10 శాఖలు ప్రారంభం..

తప్పక చదవండి

హైదరాబాద్ : సికింద్రాబాద్ పారడైజ్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన రిచ్ మాక్స్ గోల్డ్ లోన్ కంపెనీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యాలయంను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు రిచ్ మాక్స్ గోల్డ్ లోన్ కంపెనీ 10 శాఖలను ప్రారంభించటం ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న యువతకు ఇలాంటి అద్భుత అవకాశం కల్పించిన రిచ్ మాక్స్ గోల్డ్ లోన్ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అడ్వకేట్ జార్జ్ జాన్ వాలెట్ కి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం, యువత తరపున కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు పారిశ్రామిక వేత్త డా” హరి ఇప్పనపల్లి మాట్లాడుతూ రిచ్ మాక్స్ గోల్డ్ కంపెనీ ఏర్పాటు చేసిన ఈ శాఖల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కంపెనీ భాగస్వామ్యం అవుతుందని తెలిపారు. స్థానిక జీ.హెచ్.ఎం.సి. కార్పొరేటర్ చీరా సుచిత్ర శ్రీకాంత్ మాట్లాడుతూ రిచ్ మాక్స్ గోల్డ్ లోన్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించడం ద్వారా స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జాన్ వాలెట్ కి రుణపడి ఉంటామని తెలియజేశారు. కంపెనీ కార్యకలాపాలలో, అభివృద్ధి, విస్తరణకు ప్రభుత్వం తరుపున మా వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

రిచ్ మాక్స్ గోల్డ్ లోన్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అడ్వకేట్ జార్జ్ జాన్ వాలెట్ వర్చువల్ పద్దతిలో మాట్లాడుతూ.. తెలంగాణను అభివృద్ధి చేయడమే రిచ్‌మ్యాక్స్ గోల్డ్ లోన్ కంపెనీ ఫిన్‌వెస్ట్ లక్ష్యం అన్నారు. భవిష్యత్ లో రిచ్ మాక్స్ గోల్డ్ లోన్ కంపెనీ తెలంగాణ రాష్ట్రం అంతట విస్తరించబోతుందని తెలిపారు. రిచ్ మాక్స్ గోల్డ్ లోన్ కంపెనీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యాలయం, రీజినల్ శాఖను సికింద్రాబాద్ పారడైజ్ సర్కిల్ లో ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన 9 శాఖలను సూర్యాపేట, కమ్మం, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, సిద్దిపేట లో వర్చువల్ పద్ధతిలో ప్రారంభిచినట్లు తెలియజేసారు. రెండో దశలో మరో 15 శాఖలను ప్రారంభించి తద్వారా ఏడాదిలోపు 100 బ్రాంచ్‌ల లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తెలంగాణలో 400 శాఖలను ప్రారంభించే ప్రణాళికను కలిగి ఉన్నాము. ఉత్తమ ఆర్థిక సేవలతో ప్రజలకు సేవ చేయాలనే ప్రణాళికతో, కంపెనీ వినియోగదారులకు సమగ్ర ఆర్థిక పరిష్కారాలను అందించడానికి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలతో స్థానికంగా ఉండే యువతకు 2000+ ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు..

- Advertisement -

మా కస్టమర్ సెంట్రిక్ విధానంతో, రిచ్‌మాక్స్ ఫిన్‌వెస్ట్ 2030 సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా 1000 శాఖలను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2040 నాటికి పూర్తిగా సన్నద్ధమైన బ్యాంక్ హోదాను పొందడానికి సిద్దంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో రిచ్ మాక్స్ గోల్డ్ లోన్ కంపెనీ డైరెక్టర్ జాలీ సి ఎం, సేల్స్ హెడ్ శ్రీ ప్రవీణ్ బాబు, జోనల్ మేనేజర్ మిస్టర్.అలెక్స్ జోసెఫ్, తెలంగాణ రీజినల్ మేనేజర్ ఉపేందర్, రిచ్‌మాక్స్ తెలంగాణ కో-ఆర్డినేటర్ సి.హెచ్ భద్ర, రాష్ట్రంలోని వివిధ శాఖల మానేజర్స్, టాక్స్ ఫైలింగ్ సీఈఓ శ్రీనివాస్, ఇండియన్ బ్లాక్ కమేండర్ ట్రైనర్ శ్రీనివాస్ రెడ్డి, సత్యవతి, విజయ, ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సంస్థ సభ్యులు ప్రశాంత్, రాజేష్ గౌడ్, రామకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు