Tuesday, June 25, 2024

మీ అయ్యకు నిన్ను సీఎంగా ప్రకటించే దమ్ముందా?

తప్పక చదవండి
  • నిన్ను సీఎంగా ప్రకటించిన వెంటనే ఎమ్మెల్యేలంతా పార్టీని వదిలేస్తారు
  • నువ్వు మగోడివైతే… రాజాసింగ్ పై పోటీ చేయ్…
  • రూ.లక్ష కోట్ల ఆర్టీసీ ఆస్తులను కాజేసే కుట్రలో విలీనం డ్రామా
  • బిల్లును అధ్యయనం చేస్తే వాస్తవాల బయటకొస్తాయనే భయంతోనే గవర్నర్ పై దుష్ప్రచారం..
  • ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన పీఎఫ్, సీసీఎస్ బకాయిలను కూడా చెల్లించని దుర్మార్గుడు కేసీఆర్
  • ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం విలీనం చేయకపోతే… కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
  • పోటీ పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించడం చేతగాని దద్దమ్మ సర్కార్
  • గ్రామ పంచాయతీ కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం సిగ్గు చేటు
  • కేటీఆర్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్…

అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి, సీఎం కుమారుడు కేటీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కేసీఆర్ కొడుకుకు (కేటీఆర్) అహంకారం ఎక్కువైంది. డ్రగ్స్ తీసుకుంటడమో ఎప్పుడూ నిషాలో ఉంటడు కదా… మదమెక్కి ఒళ్లు బలిసి అడ్డగోలుగా మాట్లాడుతున్నడు. ఆయన మాట్లాడుతున్న తీరు, అహంకారం చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలే ఛీ…థూ అని చీదరించుకుంటున్నారు’’అని మండిపడ్డారు. ఇవన్నీ తెలిసే ఆయనను సీఎంగా కేసీఆర్ ప్రకటించడం లేదన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. ‘‘ మీ అయ్యకు నిన్ను సీఎంగా ప్రకటించే దమ్ముందా? దమ్ముంటే ఎన్నికలకు ముందే సీఎంగా నిన్ను ప్రకటించమను. అదే జరిగితే మీ పార్టీలో ఒక్కడంటే ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీలో ఉండరు. అందరూ వెళ్లిపోతారు.’’అని అన్నారు. అసెంబ్లీలో రాజాసింగ్ ను చూస్తేనే కేటీఆర్ కు వణుకు పుడుతోందన్నారు. ‘‘కేసీఆర్ కొడుకు మగోడైతే, దమ్ముంటే గోషామహల్ లో రాజాసింగ్ పై పోటీ చేసి గెలవమను’’ అంటూ సవాల్ విసిరారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన బండి సంజయ్ ను చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. వారిని నిలువరించేందుకు పోలీసులు రోప్ వేయాల్సి వచ్చింది. అదే సమయంల్ గ్రామ పంచాయతీ సిబ్బంది, వైద్య శాఖ సిబ్బంది సహా పలు ఉద్యోగ సంఘాలతోపాటు నిరుద్యోగులు సైతం బండిని కలిసి తమ తమ సమస్యలు పరిష్కరించేలా చూడాలంటూ వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడారు.

కరీంనగర్ తీగలగుట్టలోని రోడ్డుపై రైల్వే ట్రాక్ లు ఉంటే కేంద్ర జాతీయ రహదారులు, రవాణ మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడితే పూర్తిస్థాయి నిధులు తీసుకొచ్చారు. కేంద్రం చేసిన అభివ్రుద్ధి పనుల్లో భాగమే తప్ప రాష్ట్రం అభివ్రుద్ధిని గాలికొదిలేసింది. కేంద్రాన్ని తిట్టడమే పనిగా సీఎం, మంత్రులు పెట్టుకున్నారు. ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తామంటూ మోసం చేయాలని కేసీఆర్ చేసిన కుట్రలు బయటకు రావడంతో డామిట్ కథ అడ్డం తిరిగినట్లయింది. ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన 9 వేల కోట్ల రూపాయల మేరకు పీఎఫ్ నిధులతోపాటు సీసీఎస్ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది. ఆర్టీసీకి చెల్లించాల్సిన పైసలివ్వకుండా.. ఆర్టీసికి ఎంత ఆస్తి ఉందని చెప్పకుండా విలీనం చేస్తారట… ఆర్టీసీకి దాదాపు రూ. లక్ష కోట్ల ఆస్తులున్నాయి. వాటిని బీఆర్ఎస్ లీడర్లు, కేసీఆర్ బంధువులకు లీజు పేరుతో దోచి పెడుతున్నారు. ఆర్టీసీ పెన్షనర్లకు రావాల్సిన బకాయిలివ్వలేదు. గవర్నర్ స్టడీ చేస్తుంటే అవన్నీ బయటపెడతాయనే భయంతోనే గవర్నర్ వ్యవస్థనే బదనాం చేస్తున్నడు… ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. అయితే కమిటీలు, జీవోల పేరుతో కాలయాపన చేసి ఎన్నికల్లో ఓట్లు దండుకుని మోసం చేయాలని చూస్తున్నాడు. అదే జరిగితే ఖబడ్దార్.. కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం సిగ్గు చేటు. తక్షణమే చెల్లించాలి.
కేసీఆర్ కొడుకుకు (కేటీఆర్) అహంకారం ఎక్కువైంది. డ్రగ్స్ తీసుకుంటడమో ఎప్పుడూ నిషాలో ఉంటడు కదా… మదమెక్కి ఒళ్లు బలిసి అడ్డగోలుగా మాట్లాడుతున్నడు. సిగ్గుండాలే… నీ భాష, నీ అహంకారం చూసి నీ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఛీ…థూ అని చీదరించుకుంటున్నారు. అసలు మీ అయ్య ఏం చేస్తున్నడు. భారీ వర్షాలు, వరదలతో జనం అల్లాడుతుంటే పరామర్శించకుండా మహారాష్ట్రపోయి రాజకీయాలు చేస్తాడా? బండి పోతే బండి ఇస్తానంటున్నవ్ కదా…
నా కొడుకు కాబోయే ముఖ్యంమంత్రి అని మీ అయ్యను ప్రకటించమను. అట్లా ప్రకటించిన వెంటనే మీ పార్టీలో ఒక్కడంటే ఒక్కడు కూడా పార్టీలో ఉండరు. ఎమ్మెల్యేంతా వెళ్లిపోతారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఎమ్మెల్యేలు ఊరుకుంటారా? నీ అయ్య ఇస్తానన్న హామీలేమైనయో చెప్పు.. ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇండ్లు, దళిత బంధు, ఫ్రీ యూరియా, ఉద్యోగస్తులకు ఫస్ట్ నాడే జీతాలు ఇచ్చారో చెప్పు.. నిరుద్యోగులు అల్లాడుతున్నరు. పరీక్షలు నిర్వహించడమే చేతగాదు… పరీక్షలు నిర్వహిస్తే పేపర్ లీకైతది… ఒకవేళ పరీక్షలు సరిగా జరిగితే ఉద్యోగ నియామకాలు చేయడు… ఎప్పుడైనా ఉద్యోగాలిస్తే ఆ ఉద్యోగులకు సక్రమంగా జీతాలియ్యడు.. రాజాసింగ్ దమ్మేందో తెలుసు కాబట్టే కేటీఆర్ గజ గజ వణుకుతున్నడు.. నువ్వు మగోడివైతే..సీఎం కొడుకువైతే గోషామహల్ లో రాజాసింగ్ పై పోటీ చేయ్… రాజాసింగ్ బిజేపీ నుండి సస్పెండ్ అయ్యిండు.. అయినా ధర్మం కోసం, దేశం కోసం పనిచేసే నాయకుడు. కేసీఆర్ కొడుకు వ్యవహారశైలిని చూసి ప్రజలు ఛీ..థూ అంటున్నరు. ఇంటెలిజెన్స్ అధికారులను అడిగితే వాస్తవాలు చెబుతారు.. సిగ్గుండాలే మాట్లాడటానికి.. అంటూ ధ్వజమెత్తారు బండి సంజయ్..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు