Saturday, July 27, 2024

భాగ్యనగరంలో సౌభాగ్యవంతమైన దత్తాత్రేయ స్వామి ఆలయం..

తప్పక చదవండి
  • అతి శక్తివంతమైన శ్రీ గురు దత్తాత్రేయ స్వామి గుట్ట
    హైదరాబాద్ : భాగ్యనగరంలో మరో మహిమాన్వితమైన ఆంజేయస్వామి క్షేత్ర రాక్షుకుడైన శ్రీ గురు దత్తాత్రేయ ఆలయం నెలకొని ఉంది.. మహానుబావులు కొందరు తపస్సుచేసి గుట్టగా ప్రసిద్ధి చెందింది..

ఆలయ చరిత్ర :
హైదరాబాద్ లోని సీతారాం బాగ్ లో 500 సంవత్సరాల కు పైగా పురాతనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి గుట్ట ఉన్నది. ఈ ఆలయం అతి శక్తివంతమైనదని సాక్షాత్తు తెంబే స్వామిగా పిలువబడే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి, శ్రీధర స్వామి ఇక్కడ తపస్సు చేశారని చరిత్ర చెబుతుంది.

ప్రకృతి ఒడిలో :
200 మెట్లు ఎక్కిన తర్వాత ఆంజనేయస్వామి క్షేత్ర రక్షకుడైన ఈ క్షేత్రపాలక శ్రీ గురు దత్తాత్రేయ స్వామి గుడికి చేరుకుంటాము. ఈ పర్వతం చుట్టూ కొండలు, చెట్లు, పచ్చదనంతో నిండి ఉంటుంది. ఈ కొండపై నుండి విహంగ వీక్షణం ద్వారా కనిపించే భాగ్య నగరాన్ని చూస్తుంటే ఒక విహారయాత్రకు వచ్చామా అన్న అనుభూతిని ఇస్తుంది. స్వామి సన్నిధిలో శ్రీ మల్లికార్జున దేవాలయం, ఆంజనేయ స్వామి గుడి, నవగ్రహ ఆలయాలు కూడా ఉన్నాయి.

- Advertisement -

దుష్ట శక్తి నివారణ :
భూత, ప్రేత, పిశాచ బాధల నుండి విముక్తి కొరకై ప్రతి అమావాస్య, పౌర్ణమి నాడు ఇక్కడికి తండోపతండాలుగా భక్తులు వస్తారని ఆలయ అర్చకులు మడుపతి ప్రశాంత్ తెలిపారు. ప్రతిరోజు స్వామివారికి నిత్య దూప దీప నైవేద్య ఆరాధన జరుగుతుందని, తమ కోరిక నెరవేరడానికి భక్తులు ఇక్కడికి వచ్చి 16 ప్రదక్షిణలు చేసుకుంటారని ఆయన తెలిపారు. ఇక్కడికి కనీసం 7 రోజులు వచ్చి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని ఇక్కడి భక్తులు తమ ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలుపుతున్నారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు