Monday, April 29, 2024

కాల్పుల కేసులో ప్రధాన నిందితుని అరెస్ట్‌

తప్పక చదవండి

కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లా లోని మానకొండూరూ మండల కేంద్రంలో జరిగిన తుపాకీ పేలుడు సంఘటనలో ప్రధాన నిందితుడిని గురువారం నాడు పోలీసులు అరెస్ట్‌ చేసారు ఈ సంఘటనలో మరో నిందితుడిని గతంలోనే పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం విదితమే. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో పోలీస్‌ కమీషనర్‌ సుబ్బారాయుడు నిందితుని వివరాలు వివరించారు. గోదావరిఖని లోని జీఎం కాలనీ కి చెందిన వీణవంక సాయితేజ (27) చెల్లెలు ఆత్మహత్య చేసుకుని మరణించడానికి మానకొం డూరుకు చెందిన భాషబోయిన అరుణ్‌ (35) ప్రధాన కారకుడం టూ మనసులో కక్షపెంచుకుని తన స్నేహితులయిన, మంచిర్యాల జిల్లా మందమర్రి కి చెందిన కందుల ప్రదీప్‌ (25) భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ప్రాంతానికి చెందిన పాల మల్లేశం లతో కలిసి గత ఏప్రిల్‌ 19 న హైదరాబాద్‌ నుండి ద్విచక్ర వాహనంపై మానకొండూరుకు వచ్చి అదే రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో భాషబోయిన అరుణ్‌ (35) పై , గతంలో ఢల్లీి లో అక్రమంగా కొనుగోలు చేసిన నాటు తుపాకీతో కాల్పులు జరి పారు. ఈ దాడిలో నాటు తుపాకీ పేలకపోవడంతో భాషబోయిన అరుణ్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనలో నిందితుడు పాల మల్లేశం ను గతంలోనే అరెస్ట్‌ చేయడం జరిగిందన్నారు.ఈ కేసు లో ప్రధాన నిందితుడైన వీణవంక సాయితేజ పై హైదరా బాద్‌ నగరంలోని అల్వాల్‌ , నల్లకుంట మంచిర్యాల జిల్లా జైపూర్‌ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పోలీస్‌ స్టేషన్‌ లలో మత్తు, మాదక పదార్థాల విని యోగం, అక్రమ రవాణాకు సంబంధించిన పలు కేసులు నమోదయివున్నాయని త తెలిపారు.ఈ కేసు లో ప్రధాన నిందితుడైన వీణవంక సాయితేజ కదలికలపై నిఘా ఉంచి పక్కా సమాచారంతో గురువారంనాడు మానకొండూరు ఇన్స్పెక్టర్‌ రాజ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌ బస్టాండ్‌ ప్రాంతంలో పట్టుకు న్నారు . ఈ సంఘటనలో ఒక నాటు తుపాకీ రెండు తూటాలను స్వాధీన పరుచుకోవడం జరిగిందని వివరించారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటనలో నిందితులను అరెస్ట్‌ చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన మానకొండూర్‌ ఇన్స్పెక్టర్‌,సిబ్బందిని పోలీస్‌ కమీషనర్‌ ఎల్‌. సుబ్బరాయుడు అభినందించారు .

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు