Friday, October 11, 2024
spot_img

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌

తప్పక చదవండి
  • క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన పివి సింధు
    సిడ్నీ : భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2023 మహిళల సింగిల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ప్రీక్వార్టర్స్‌లో 5వ సీడ్‌ పీవీ సింధు మన దేశానికే చెందిన ఆకర్షి కశ్యప్‌ను ఓడిరచింది. 38 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్‌ను సింధు 2114, 2110 తేడాతో వరుస సెట్లలో ఓడిరచింది. క్వార్టర్‌ ఫైనల్‌లో సింధు అమెరికాకు చెందిన 4వ సీడ్‌ బీవెన్‌ జాంగ్‌తో తలపడనుంది. సింధు, జాంగ్‌ చివరిసారిగా 2020లో తలపడ్డారు. అమెరికా షెట్లర్లపై హెడ్‌ టూ హెడ్‌ రికార్డుల్లో 64తో సింధు అధిక్యంలో ఉంది. కాగా వరుసగా జపాన్‌ ఓపెన్‌, కొరియా ఓపెన్‌లలో మొదటి రౌండ్‌లోనే నిష్కమ్రించిన సింధు ఆస్టేల్రియా ఓపెన్‌లో రాణిస్తుండడం భారత్‌కు శుభ పరిణామంగా చెప్పుకొవచ్చు. త్వరలోనే ఆసియా గేమ్స్‌ జరగనున్న నేపథ్యంలో సింధు ఫామ్‌లోకి రావడం మంచి విషయమని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఇక మరో తెలుగు ప్లేయర్‌ కిదాంబి శ్రీకాంత్‌ కూడా పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్‌లో అడుగుపెట్టాడు. ప్రీక్వార్టర్స్‌లో 2110, 2117 తేడాతో చైనీస్‌ తైఫీ ప్లేయర్‌ సు లి యాంగ్‌ను ఓడిరచాడు. కాగా ఆస్టేల్రియా ఓపెన్‌లో క్వార్టర్స్‌కు చేరుకోవడం కిదాంబి శ్రీకాంత్‌కు ఇది మూడో సారి. అలాగే మరో భారత ఆటగాడు ప్రియాంషు రజావత్‌ కూడా పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్‌లో అడుగుపెట్టాడు. 59 నిమిషాలపాటు సాగిన ప్రీక్వార్టర్స్‌లో చైనీస్‌ తైపీకి చెందిన వాంగ్‌ త్జు వీనిని ప్రియాంషు ఓడిరచాడు. 218, 1321, 2119తో గెలిచి క్వార్టర్స్‌లో అడుగు పెట్టాడు. కాగా క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో భారత ఆటగాల్ళైనా కిదాంబి శ్రీకాంత్‌, ప్రియాంషునే తలపడడం గమనార్హం. కాగా మరో భారత ఆటగాడు మిథున్‌ మంజునాథ్‌ పురుషుల సింగిల్స్‌లో మలేషియాకు చెందిన లీ జి జియాతో పోరాడి ఓడాడు. 1321, 2112, 19`21తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు