- మద్దతు తెలిపిన ఏఐటీయూసీ సంఘం నాయకులు..
- ఎలాంటి షరతులు లేకుండా పర్మినెంట్ చేయాలని డిమాండ్..
జనగామ :
సోమవారం రోజున జనగామ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఏఐటియుసి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు.. ఏఎన్ఎంలు 16 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు.. కాగా వీరికి మద్దతుగా జిల్లా ఏఐటీయూసీ సంఘం నాయకులు అధ్యక్షులు కిమిడి మల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శ ఆకుల శ్రీనివాస్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఎండనక, వాననక ఏఎన్ఎంలు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సేవ చేశారు.. ఆ రోజు వాళ్లను దేవుళ్ళతో పోల్చిన సీఎం కేసీఆర్ కు ఈరోజు వాళ్ళు కనిపించడం లేదా..? ఇప్పుడు వారిని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం.. ఈ విషయంలో ఏ.ఎన్.ఎం. లను ఎలాంటి పరీక్షలు లేకుండా క్రమబద్ధీకరించాలని, అదే విధంగా నోటిఫికేషన్ రద్దు చేయాలని, వారిని రెగ్యులరేషన్ చేయాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సంఘం నాయకురాలు పాతూరు సుగుణమ్మ, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు రావుల సదానంద్, మోటే శ్రీశైలం, గోల్కొండ నాగరాజు, ఏఎన్ఎం నాయకురాలు బండి వనజ,
జీ. సునీత, కరుణ, ఎల్. వనజ, ఉజ్వల, రాధిక, మేరీ, అనిత, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు..