Saturday, May 4, 2024

స్వర్గీయ ఎన్ఠీఆర్ కు దక్కిన గౌరవం..

తప్పక చదవండి
  • ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల..
  • రాష్ట్రపతి ముర్ము చేతుల విూదుగా ఆవిష్కరణ
  • హాజరైన ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు

న్యూ ఢిల్లీ : ఉమ్మడి ఆంధ్రపద్రేశ సిఎం, దివంగత ఎన్టీఆర్‌ స్మారక నాణెళిన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్‌, ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి, దగ్గుపాటి వెంకటేశ్వర్లు, నటుడు బాలకృష్ణ, నారా బ్రాహ్మణి , ఎన్టీఆర్‌ కుటుంబ అలాగే టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్‌, గల్లా జయదేవ్‌, కేశినేని నాని, రామ్మోహన్‌ నాయుడు, ఎంపీ రఘురామ కృష్ణరాజు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌, మాజీ ఎంపీ సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్‌ రావు, నిర్మాత అశ్విని దత్‌, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తదితరులు ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు.

ఎన్‌టీఆర్‌ పేరిట రూ.100 నాణెం విడుదల చేయాలన్న కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించడం గొప్ప విషయం. పురంధేశ్వరి ఈ పక్రియలో ముందు నుంచి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. తెలుగు సినిమా ద్వారా దేశ సంస్కృతిని చాటి చెప్పారు. రామాయణ, మహాభారతాలకు ఆయన నటనతో జీవం పోశారు. రాముడు, కృష్ణుడి చరిత్రని అందరికీ చాటి చెప్పారు. ఆయననే రాముడు అనుకునే స్థాయిలో నటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎంతో కింది స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగారు. అలాంటి వ్యక్తి ఎన్‌టీఆర్‌ స్మారక నాణెం విడుదల చేయడం చాలా సంతోషకరం. ఎన్‌టీఆర్‌ కేవలం కొంత మందికే హీరో కాదని, తరతరాలకు హీరో. శతజయంతి సందర్భంగా ఆయనను ఇలా స్మరించుకోడం గొప్ప విషయం. ఇప్పటికీ సోషల్‌ విూడియాలో ఆయనకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఆయన స్మారకంగా రూ.100 నాణెం విడుదల చేయడం చాలా ఉద్వేగమైన క్షణం అంటూ కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ అరుదైన దృశ్యం సాక్షాత్కారమైంది. ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులు సైతం కార్యక్రమానికి హాజరయ్యారు. షూటింగ్‌లో బిజీగా ఉన్నందున జూనియర్‌ ఎన్టీఆర్‌, పాదయాత్రలో ఉన్నందున లోకేష్‌ హాజరుకాలేదు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ నాణెళిన్ని ముద్రించింది. 44 మిల్లీ విూటర్ల చుట్టు కొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణెళిన్ని 50శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్‌, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. ఈ నాణెళినికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్‌ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఆయన శతజయంతి ఈ ఏడాదితో ముగిసింది. కనుక 1923` 2023 అని ముద్రితమై ఉంటుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు