Wednesday, May 15, 2024

మంత్రులకు శాఖల కేటాయింపు

తప్పక చదవండి
  • ఆర్థికశాఖ మంత్రిగా భట్టి విక్రమార్క
  • రెవెన్యూ, సమాచారశాఖ మంత్రిగా పొంగులేటి
  • ఐటి, శాసనసభా వ్యవహారాల మంత్రిగా శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌ : ఎట్టకేలకు మంత్రులకు శాఖలను కేటాయించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖను కేటాయించారు. అలాగే ఐటి, సభా వ్వయహారాలను శ్రీధర్‌ బాబుకు కేటాయించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ అధిష్టానంతో చర్చించిన సీఎం రేవంత్‌ కొత్తగా ప్రమాణం చేసిన 11 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. ఢిల్లీ వెళ్లి అధినాయకత్వంతో చర్చించి శాఖలు కేటాయించారు. ఆయా మంత్రులకు శాఖలు కేటాయించినట్టు రాజ్‌భవన్‌కు సందేశం సీఎం కార్యాలయం పంపించింది. సీఎం రేవంత్‌ రెడ్డి వద్దే హోంశాఖతోపాటు ఇతర కీలకమైన శాఖలు ఉండబోతున్నాయి. మిగతా మంత్రుల ఖాళీలు భర్తీ అయ్యేంత వరకు ఆ శాఖలు ఆయన చూస్తారు. ఆయన వద్ద మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌, లా అండ్‌ ఆర్డర్‌, కేటాయించని విద్య ఇతర శాఖలు కూడా ఉన్నాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లు భట్టి విక్రమార్కకు కీలకమైన శాఖలు కేటాయించారు. ఆర్థిక శాఖతోపాటు విద్యుత్‌ శాఖ బాధ్యతలను కూడా అప్పగించారు. మిగతా మంత్రులకు కేటాయించిన శాఖలు ఇలా ఉన్నాయి. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నీటిపారుదల, సీఏడీ, ఫుడ్‌ అండ్‌ సివిల్‌ సప్లై, దామోదర్‌ రాజనర్సింహా వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డిరోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఐటీ, ఎలక్టాన్రిక్స్‌,కమ్యూనికేషన్స్‌ ఇండస్ట్రీస్‌, కామర్స్‌ లెజిస్లేటివ్‌ అఫైర్స్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిరెవన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖలను కేటాయించారు. పొన్నం ప్రభాకర్‌ రవాణా, బీసీ వెల్ఫేర్‌ శాఖ,కొండా సురేఖఎన్విరాన్‌మెంట్‌, అటవీశాఖ, దేవాదాయ శాఖలను, అనసూయ సీతక్క పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశుసంక్షేమ శాఖలను, తుమ్మల నాగేశ్వరరావువ్యవసాయ శాఖ, చేనేత శాఖ, మార్కెటింగ్‌ కోఆపరేషన్‌, జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్‌ శాఖ, పర్యాటక సాంస్కృతిక శాఖలను కేటాయించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు