Sunday, October 6, 2024
spot_img

బఫర్‌ జోన్‌లో అన్నీ అక్రమ నిర్మాణాలే

తప్పక చదవండి
  • ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం
  • పొలిటికల్‌ లీడర్లు, ఉద్యోగుల ప్రమేయంతోనే అక్రమాలు
  • సబ్‌ రిజిస్ట్రార్‌ శాఖకే టోకరా!
  • మామాళ్ళుతోనే అన్ని సక్రమాలేనని డాక్యుమెంట్లు
    ఖమ్మం : ఖమ్మం నగరంలోని 4 వ డివిజన్‌ యు పి హెచ్‌ కాలనీలో బఫర్‌ జోన్‌ గా గుర్తించిన ఎలాంటి అనుమతులు లేకుండా నే అన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. నిర్మాణాలకు సంబంధించి స్ధానిక కార్పొరేటర్‌ , నగర పాలక సంస్థ కు చెందిన ఉధ్యోగులు , సిబ్బందికి మామాళ్ళు ముట్ట జెప్పడంతోనే నిర్మాణాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు గా అయా ఇంటి యజమానులే బహిరంగ చెప్పడం కొసమెరుపు. బఫర్‌ జోన్‌ లో స్ధలాలు కొనుగోలు, అమ్మకాలు వరకు సరే. నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇస్తారనేది పశ్నాగా మారింది. కేవలం పరిశ్రమలకు అనుమతులు మినహా నివాసాలకు యోగ్యమైనది కాదని నిర్ధారించిన అధికారులు ఈ నిర్మాణాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే దానిపై పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులు కనీసం క్షేత్ర స్ధాయిలో నైనా తనిఖీ లు నిర్వహించక పోవడం శోచనీయం. ఇది ఇలా ఉండగా యు పి హెచ్‌ కాలనీలో సుమారు పదుల సంఖ్యలో ఉన్న ప్రతి చోట ఉన్న రెండు, మూడు ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూములు ఉన్న చోట రాజకీయ నాయకులు, ఉధ్యోగులు సుమారు 200 నుంచి 400 గజాల వరకూ ప్రవేటు భూమి ని కొనుగోలు చేసి ప్రభుత్వ భూమి 500 గజాల నుంచి 1000 గజాల వరకూ అక్రమించి నిర్మాణాలను చెపట్టి ఇతరులకు అమ్మి లక్షలు , కోట్ల రూపాయలు గడిస్తున్నారు. అదే కాలనీలో ని ఖానాపురం హావేలీ రెవిన్యూ సర్వే నెంబర్‌ 318/ ఉ ఫ్లాట్‌ నెంబర్‌ 20 లో 303.33 గజాల స్ధలంలో ఇల్లు నిర్మాణం చేసి ఉంటే అదే స్ధలాన్ని ఖాళీ స్ధలంగా రిజిస్ట్రేషన్‌ చేసి రిజిస్ట్రేషన్‌ శాఖ నే మోసం చేశారు ఓ ప్రబుద్దుడు. ఈ మోసం చేసిన విషయంలో ఓ రాజకీయ జాతీయ పార్టీ నేత ప్రమేయం తో పాటు రిజిస్ట్రేషన్‌ శాఖ చెందిన అధికారుల ప్రమేయం ఉన్నట్లు గా ఆరోపణలు చోటు చెసుకున్నాయి. ఇన్ని అక్రమాలకు మామాళ్ళే చెతులు మారడంతో నే సాధ్యం అని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి జరిగిన అక్రమాలపై క్షేత్ర స్ధాయిలో విచారించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతం వాసులు కోరుతున్నారు. గమనిక ఫోటోలు ఉన్నాయి..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు