Saturday, May 18, 2024

వాయిదాల సభలు

తప్పక చదవండి
  • పార్లమెంట్‌ సోమవారానికి వాయిదా
  • వరుసగా ఏడోరోజూ మణిపూర్‌ మంటలు
  • ప్రతిష్ఠంభన మధ్యే విపక్షాల ఆందోళన
  • టీిఎంసీ నేత ఒబ్రెయిన్‌ పై మండిపడ్డ ధన్‌కడ్‌
  • చర్చించడానికి 267 అవసరం లేదన్న గోయల్‌
    న్యూఢిల్లీ : మణిపూర్‌ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యులు పట్టువిడుపులు లేని ధోరణ ప్రదర్శించడంతో వరుసగా ఏడోరోజు కూడా పార్లమెంటు సమావేశాలు వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో ప్రతిష్టంభనతో పార్లమెంట్‌ సోమవారానికి వాయిదా పడిరది. రాజ్యసభలో చైర్మన్‌ జగ్దీప్‌ ధన్‌కఢ్‌,
    టీఎంసీ నేత డెరిక్‌ ఒబ్రెయిన్‌ మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. మణిపూర్‌ అంశంపై రూల్‌ 267 కింద విపక్షాలు ఇచ్చిన నోటీసును ధన్‌కఢ్‌ తోసిపుచ్చడంతో టీఎంసీ ఎంపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వీరిమధ్య వాదన చోటుచేసుకుంది. దీంతో సభను చైర్మన్‌ వాయిదా వేశారు. అటు, లోక్‌సభలోనూ మణిపూర్‌ అంశంపై విపక్ష నేతలు ఆందోళన కొనసాగించడంతో సభ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా పడిరది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్‌ హింసపై చర్చ జరగాలంటూ ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభలను స్తంభింపజేస్తున్నాయి. కాంగ్రెస్‌, టీఎంసీ, ఆప్‌ తదితర పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ఘర్షణలపై స్పందించా లని డిమాండ్‌ చేస్తున్నాయి. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి పునరావృ తమైంది. టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఒబ్రెయిన్‌, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ మధ్య వాడివేడి సంభాషణ జరిగింది. చివరికి సభ అర్థాంతరంగా వాయిదా పడిరది. రాజ్యసభలో అన్ని కార్యకలాపాలను వాయిదా వేసి, తాము లేవనెత్తిన అంశంపై చర్చించాలని కాంగ్రెస్‌, వామపక్షాలు, టీఎంసీ, ఎస్పీ, ఆప్‌, ఎన్‌సీపీ, డీఎంకే పార్టీలకు చెందిన 47 మంది ఎంపీలు శుక్రవారం ఉదయం రూల్‌ 267 ప్రకారం నోటీసులు ఇచ్చారు. అయితే సభ ప్రారంభమైన వెంటనే ఇద్దరు సభ్యులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. పదవీ విరమణ చేస్తున్న బీజేపీ ఎంపీ వినయ్‌ దినుర్‌ టెండూల్కర్‌కు వీడ్కోలు పలికింది. అనంతరం రూల్‌ 267 ప్రకారం నోటీసులిచ్చిన ఎంపీల పేర్లను రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ చదివారు. సభ్యులు లేవనెత్తిన అంశంపై చర్చించేందుకు అంగీకారం తెలిపానని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా స్వల్ప కాలిక చర్చలో పాల్గొనాలని కోరారు. ప్రజలకు స్ఫూర్తిదాయకంగా సభ్యులు ప్రవర్తించాలని కోరారు. ప్రతిరోజూ ఒకే విధమైన పరిస్థితి కొనసాగడం వల్ల సభ్యులకు దక్కవలసిన గౌరవం లభించద న్నారు. తాను అనేక విధాలుగా సమాచారాన్ని సేకరించానని, ఈ సమాచారం చాలా బాధాకరంగా ఉందని చెప్పారు. రుసగా ప్రతి సమావేశాల్లోనూ, ప్రతి రోజూ రూల్‌ 267 ప్రకారం అనేక నోటీసులు వస్తున్నాయన్నారు. గడచిన 23 ఏళ్లలో ఇలాంటి ఎన్ని నోటీసులకు అనుమతి లభించిందో ఈ సభకు తెలుసునని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయం చాలా ముఖ్యమైనదని, ఎంపీలు ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతారని చెప్పారు. పార్లమెంటరీ కార్యకలాపాలకు ప్రశ్నోత్తరాల సమయం హృదయం వంటిదని తెలిపారు. దీంతో డెరెక్‌ ఒబ్రెయిన్‌ స్పందిస్తూ, ఇదంతా మాకు తెలుసని అన్నారు. ఈ సమావేశాలు ప్రాంభమైనప్పటి నుంచి మణిపూర్‌ సమస్య గురించి ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయని, దానిని చేపట్టాలని డిమాండ్‌ చేశారు. జగదీప్‌ ధన్‌కర్‌ స్పందిస్తూ, ‘దీని గురించి మీకు తెలుసునని నాకు తెలుసు. మీరు చెప్పనక్కర్లేదు. కేవలం వినండి చాలు. మీరు వింటే, మీకు అర్థమవుతుంది‘ అని అన్నారు. కానీ ఒబ్రెయిన్‌ వెనుకంజ వేయలేదు. అప్పుడు ఆయనను తన స్థానంలో కూర్చోవాలని ధన్‌కర్‌ కోరారు. మిస్టర్‌ డెరెక్‌ ఒబ్రెయిన్‌, నాటకీయ ప్రదర్శనలు చేయడం మీకు అలవాటుగా మారింది. ప్రతిసారీ మీరు లేచి నిలబడతారు, అది మీ విశేష అధికారంగా భావిస్తారు. సభాపతి స్థానాన్ని గౌరవించడం మీ కనీస కర్తవ్యం. నేను ఏం చెప్పినా, మీరు లేచి, నాటక ప్రదర్శనలు చేస్తారని మండిపడ్డారు. జగదీప్‌ ధన్‌కర్‌ వ్యాఖ్యలపై స్పందించిన ఒబ్రెయిన్‌ మాట్లాడుతూ, ఆయన ముందు ఉన్న బల్లపై గట్టిగా కొడుతూ, తాను నిబంధనలకు అనుగుణంగానే ప్రవర్తిస్తున్నానని చెప్పారు. దీంతో ధన్‌కర్‌ స్పందిస్తూ, ‘బల్ల మీద కొట్టకండి. దాన్ని కొట్టకండి. ఇది రంగస్థలం కాదని అన్నారు. ‘మేం దీనిని సహించం, ఐయామ్‌ సారీ‘ అన్నారు. ఒబ్రెయిన్‌ ఏదో చెప్పబోతుండగా, ధన్‌కర్‌ సభను సోమవారానికి వాయిదా వేశారు. ‘దీనిని మేం భరించలేం‘ అని అంటూ సభ నుంచి వెళ్లిపోయారు. మణిపూర్‌ అంశంపై పార్లమెంటు ప్రతిష్ఠంభనకు కారణమవుతున్న రూల్‌ 267 పై కేంద్ర మంత్రి, రాజ్యసభలో బీజేపీ పక్ష నేత పీయూష్‌ గోయల్‌ తొలిసారి వివరణ ఇచ్చారు. ఏ సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని, కానీ విపక్ష పార్టీలు రూల్‌ 267 కింద చర్చ జరపాలని పట్టుబట్టడం సరికాదని అన్నారు. మణిపూర్‌ హింసపై చర్చ విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఏడు రోజులుగా ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. రూల్‌ 267 కింద సభాకార్యక్రమాలన్నీ రద్దు చేసి చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుపడుతుండగా, అధికార పార్టీ మాత్రం నిరాకరిస్తోంది. స్వల్పకాలిక చర్చకు సిద్ధమని పదేపదే చెబుతోంది. ఈ నేపథ్యంలో రూల్‌ 267 నిబంధన కింద ఎందుకు చర్చను ప్రభుత్వం ఎందుకు కాదంటోందో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ శనివారంనాడు వివరణ ఇచ్చారు. మణిపూర్‌ అంశంపై సరైన పద్ధతిలో చర్చ జరపాలని మరో సారి విపక్షాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ సమస్యకైనా చర్చలే పరిష్కారం. పార్లమెంటులో చర్చకు మేము అంగీకరించాం. అయితే విపక్షాలు మాత్రం రూల్‌ 267 రూల్‌ కిందనే చర్చ జరపాలని ఆ తర్వాత పట్టుబట్టాయి. మరొక మార్గం లేనప్పుడు మాత్రమే ఈ రూల్‌ వర్తింపజేయాలి. కానీ, ఈరోజుతో ఏడు రోజుల సభాసమయం గడిచిపోయింది. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే రూల్‌ 267 అమలు చేయాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ రూల్‌ కింద చర్చ జరపాలంటే, సభాపతి అనుమతిపై ఆరోజు నిర్దేశిరచిన సభా కార్యక్రమాలన్నీ రద్దు చేసి అత్యవసరంగా చర్చ మొదలుపెట్టాలి.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు