Saturday, July 27, 2024

ఏడీఏ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ 2023..

తప్పక చదవండి

హైదరాబాద్ : ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ రిక్రూట్‌మెంట్ బోర్డ్ వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో పరిమిత పదవీకాల ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ కోసం ఉద్యోగ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఏడీఏ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2023 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఆగస్టు 11, 2023న ప్రారంభమవుతుంది.. ఏడీఏ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్‌లైన్ లో దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 8, 2023.

ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ప్రకారం, ఏడీఏ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు 2023 కోసం ఎంపిక ప్రక్రియ అప్లికేషన్‌ల షార్ట్‌లిస్ట్, ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు, చివరి వ్యక్తిగత ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.

- Advertisement -

సంస్థ పేరు : ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ.. పోస్ట్ : ప్రాజెక్ట్ ఇంజనీర్.. పోస్టుల సంఖ్య : 53.. దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 8, 2023.. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అధికారిక వెబ్‌సైట్: www.ada.gov.in

ఉద్యోగ ఖాళీలు : పీఈ – 1 – 40.. పీఈ – 2 – 9.. పీఈ –3 – 4.. మొత్తం పోస్ట్‌లు 53..
విద్యా అర్హతలు, అనుభవం : అభ్యర్థులు మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఇంజనీరింగ్ / టెక్నాలజీలో కనీసం ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి తత్సమానంగా ఉండాలి. పీఈ – 1 పోస్టుకు అభ్యర్థులకు కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.. పీఈ – 2 పోస్ట్ కు అభ్యర్థులకు కనీసం 4 సంవత్సరాల అనుభవం ఉండాలి.. పీఈ – 3 పోస్ట్ కు అభ్యర్థులకు కనీసం 8 సంవత్సరాల అనుభవం ఉండాలి

వయో పరిమితి : పీఈ -1 పోస్ట్ కు అభ్యర్థులకు వయోపరిమితి 35 నుండి 40 సంవత్సరాలు ఉండాలి.. పీఈ – 2 పోస్ట్ కు అభ్యర్థులకు వయస్సు పరిమితి 45 సంవత్సరాలు.. పీఈ – 3 పోస్ట్ కు అభ్యర్థులకు వయస్సు పరిమితి 55 సంవత్సరాలు ఉండాలి..

జీతం వివరాలు : పీఈ -1 పోస్ట్ కోసం ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.50,000 జీతం, డియర్‌నెస్ అలవెన్స్ పొందుతారు.. పీఈ-2 పోస్ట్ ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు నెలకు రూ.60,000 జీతం, డియర్‌నెస్ అలవెన్స్ అందుతాయి.. పీఈ-3 పోస్ట్ లైక్ చేసిన అభ్యర్థులకు నెలకు రూ.70,000 జీతం, డియర్‌నెస్ అలవెన్స్ అందుతాయి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు