Friday, May 17, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

మానవత్వం పరిఢవిల్లిన గడ్డన..
ఆ మతం గొప్పది ఈ మతం గొప్పదంటూ..
ప్రగల్బాలు పలుకుతూ యువతరం
రక్తంలో కొత్త మేధస్సుకు బదులు
విష సంస్కృతిని నింపుతున్న
నా దేశం వెనక్కి వెళ్తోంది..
కులాలంత ఒకే కుటుంబంలా బతికినకాడ..
కుల కులానికి మధ్యన నిప్పు కుంపట్లు వెల్గించి..
కత్తులతో కోలాటమాడడేటట్లు చేసే
మనువాద సంస్కృతి రాజ్యమేలుతున్నంతకాలం
నా దేశం వెనక్కి వెళ్తుంది..
బుక్కెడు బువ్వ దొరక్క..
దినదినము వేలమంది నేలరాలుతున్న నేలన
మత మందిరాలకు వేలకోట్లు తగలేసే
నా దేశం వెనక్కి వెళ్తుంది..
– సన్నీ

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు