హైదరాబాద్ : మలిదశ తెలంగాణ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారులు పోషించిన పాత్ర యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిందని అందులో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుల పాత్ర వెలకట్టలేనిదని ఆ త్యాగాలకు పోరాట స్ఫూర్తికి నేడు కనీస గుర్తింపు లేకుండా పోయిందని స్వరాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడచిన మా భవిష్యత్తులకు భరోసా లేకుండా పోయిందని కేయూ జేఏసీ చైర్మన్ డా. సాదు రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యార్థి ఉద్యమకారుల సంక్షేమానికై ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు హైదరాబాద్ సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేయూ జేఏసీ నాయకులు తమ డిమాండ్లను మీడియా ముందు ఉంచారు మలిదశ తెలంగాణ ఉద్యమానికి కెసిఆర్ తొలి అడుగులు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులతో కలిసి వేశారని వారు గుర్తు చేశారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులతో పోల్చుకుంటే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారులు ఏం తక్కువ పోరాటం చేశారని చేసిన నాయకులు సూటిగా ప్రశ్నించారు ఓయు ఉద్యమకారులకు ఎంపీ ఎమ్మెల్యే కార్పొరేషన్ పదవులు కూడా ఇచ్చిన ముఖ్యమంత్రి కి కాకతీయ యూనివర్సిటీ ఉద్యమకారులు ఎందుకు గుర్తు రావడంలేదని సూటిగా ప్రశ్నించారు ఆరోజుల్లో మా భవిష్యత్తును లెక్కచేయకుండా ఉద్యమంలో పాల్గొన్నాం దెబ్బలు తిన్నాం కేసులైన ఇప్పటికే కొంత మంది చనిపోయారు అప్పుడు 25 ఏళ్ల వయసులో ఉన్న మేము ప్రస్తుతం 3540లోకి వచ్చేసాం. ఇంక మాకు ఎప్పుడూ ఉద్యోగాలు దొరుకుతాయి ఎప్పుడూ ఉపాధి లభిస్తుంది. ఉద్యమ కాలంలో ఆంధ్ర పార్టీలకు ఆంధ్ర నాయకులకు తొత్తులుగా పనిచేసిన వాళ్లకు నేడు మంత్రి పదవులు ఎమ్మెల్సీ పదవులు ఎమ్మెల్యే పదవులు ఉన్నాయి. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి జీవిత భద్రత గురించి ఆలోచించకుండా ఉద్యమంలో పాల్గొన్న మా బహుజన విద్యార్థులంతా అన్ని రకాల నష్టపోయారు ప్రభుత్వం మేల్కోవాలి మా కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి హెల్త్ కార్డులు ఇప్పించాలి అని కేయూ చేసి డిమాండ్ చేశారు రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలకు బుద్ధి వచ్చేలా చేయడానికి వెనుకా డేది లేదని సవాల్ విసిరారు వరంగల్ జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలకు కేయూ విద్యార్థి ఉద్యమ నాయకులు పోటీ చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డా.ఫిరోజ్ పాషా డా.చిర్రా రాజు, డా.మంద వీరస్వామి, మాచర్ల శరత్ చంద్ర, డా.పాలమాకుల కొమరయ్య, డా. మేడారపు సుధా కర్, ఇట్టబోయిన తిరుపతి యాదవ్ డా. సంత్రపు అనిల్ డా. ఆరూరి రంజిత్, కత్తెరపల్లి దామోదర్, మోడే చిరంజీవి, మేడా రంజిత్, రాజ్ మనోజ్, డి ప్రేమ్, విష్ణువర్ధన్ రెడ్డి, కృష్ణ లత పాల్గొన్నారు.