Thursday, May 16, 2024

76 శాతంరూ.2000 నోట్లు వెనక్కి..ఆర్బీఐ వెల్లడి

తప్పక చదవండి

మార్కెట్లో చలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 76 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చిందని ఆర్బీఐ సోమవారం వెల్లడిరచింది. అత్యధికంగా ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు చేశారని తెలిపింది. రూ.2000 కరెన్సీ నోట్లను మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు గత మే 19న ఆర్బీఐ ప్రకటించింది. రూ. 2000 కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి గానీ, బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడానికి గానీ సెప్టెంబర్‌ 30 వరకు ఆర్బీఐ గడువు విధించింది. బ్యాంకుల నుంచి వచ్చిన డేటా ప్రకారం గత నెలాఖరు (జూన్‌ 30) నాటికి రూ.2.72 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ వివరించింది. ప్రస్తుతం మార్కెట్లో ఇంకా రూ.84 వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో మే 19 నుంచి జూన్‌ 30 వరకు రూ.2000కరెన్సీ నోట్లు 76 శాతం తిరిగి వెనక్కి వచ్చాయని తేలింది. 87 శాతం నోట్లు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల ద్వారా, మిగతా 13 శాతం ఇతర డినామినేషన్‌ నోట్లతో మార్పిడి జరిగిందని తెలిపింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు