Friday, September 13, 2024
spot_img

విదేశాల్లో అవమానం

తప్పక చదవండి
  • భారతీయ విద్యార్థులకు ఎదురైన చేదు అనుభవం..
  • 21 మందిని వెనక్కి పంపిన అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు..
  • సరైన పత్రాలు లేవంటూ ఆరోపణలు..

హైదరాబాద్‌ : ఉన్నత చదువులు చదివేందుకు ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన పలువురు భారతీయ విద్యార్థులకు చుక్కెదురైంది. దాదాపు 21 మంది విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తిరిగి భారత్‌కు వెనక్కి పంపారు. అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో ఉన్నత చదువుల కోసం విద్యార్థులు అమెరికా వెళ్లగా.. సరైన పత్రాలు లేవంటూ అనుమతి నిరాకరించారు. వీసా పక్రియలను పూర్తి చేసినప్పటికీ.. ఆయా విశ్వవిద్యాలయాల నుంచి అడ్మిషన్లు పొందినా కూడా మెయిల్స్‌, సోషల్‌ విూడియా అకౌంట్లను తనిఖీ చేసిన అనంతరం అధికారులు తిరిగి వారిని భారత్‌కు పంపారు. ఇలా అట్లాంట, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగోలో విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. భారతీయ విద్యార్థులను తిరిగి ఎయిర్‌ ఇండియా విమానంలో భారత్‌కు పంపారు. ఆయా విద్యార్థులు అమెరికాలో ప్రవేశించకుండా ఐదేళ్లపాటు పాటు నిషేధం విధించారు. సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతోనే విద్యార్థులను తిప్పి పంపినట్లుగా తెలుస్తుంది. ఇందులో తెలుగు రాష్టాల్రకు చెందిన విద్యార్థులు సైతం ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు