- అమీన్ పూర్ చెరువు.. అదెక్కడుంది..? భవిష్యత్తులో ఇలా చెప్పుకోవాల్సిందే..
- ఇరిగేషన్ ఎన్.ఓ.సి లేకుండానే హెచ్.ఎం.డి.ఏ అనుమతులు పొందిన కేటుగాడు
- చెరువులో అక్రమ నిర్మాణాలే.. ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదాయ వనరులు ..
- అవినీతి మత్తులో జోగుతున్న అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఆదాబ్
- అమీన్ పూర్ చెరువులో ఎఫ్టిఎల్, బఫర్ జోన్‌లో యదేచ్ఛగా నిర్మిస్తున్న నిర్మాణాలు..
- అధికారుల కనుసన్నల్లో యదేచ్ఛగా అక్రమ నిర్మాణ పనులు..
- కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్న అవినీతి అధికారులు..
- చర్యల పేరుతో కాలయాపన చేస్తూ.. దగ్గరుండి పనులు చేయిస్తున్న దారుణం..
- గాడి తప్పిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాలన..
- చెరువులు అన్యాక్రాంతం కావడానికి కారణం అధికారులే అంటున్న స్థానిక ప్రజలు..
- చెరువులను పరిరక్షించే టాస్క్ ఫోర్స్ కమిటీ నిద్ర పోతుందా..?
- ఏస్. ఆర్ కన్స్ ట్రక్షన్ యజమాని పడేసే ఎంగిలి మెతుకులకు అమ్ముడు పోయిందా..?
- మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి గారు మీ శాఖ అధికారులు తీరు చూడండి..
అబ్బో ఇక్కడ ఒకప్పుడు పెద్ద చెరువు ఉండేదట.. చాలా అందంగా ఉండేదట.. ఈ ప్రాంతానికి నీళ్ల కరువు ఉండేది కాదట.. ఈ ప్రాంతమంతా పచ్చదనంతో తులతూగేదట.. అంటూ చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడబోతోంది.. చెరువులను ఆక్రమిస్తూ నిర్మాణాలు సాగిస్తున్న అక్రమార్కులకు.. కొందరు అవినీతి అధికారులు తోడవ్వడంతో ఈ పరిస్థితి నెలకొంది.. అమీన్ పూర్ పెద్ద చెర్వు ఎంతో ప్రాముఖ్యత కలిగిన చెరువు.. ఈ చెరువుని చెరబట్టారు దుర్మార్గులు..
సంగారెడ్డి జిల్లాలోని, అమీన్ పూర్ మండలం, పెద్ద చెరువు ఎఫ్టీల్ బఫర్ జోన్లలో ఇరిగేషన్ ఏన్.ఓ.సి లేకుండానే.. భారీ భవనాలు నిర్మిస్తు కోట్లు కొల్లగొడుతున్నారు ఏస్.అర్ కన్స్ ట్రక్షన్ సంజీవ రెడ్డి.. చెరువులో, బఫర్ జోన్లలో దొడ్డి దారిన అనుమతులు పొంది యదేచ్ఛగా నిర్మాణాలు చేస్తూ ప్రభుత్వానికే సవాలు విసురుతున్నాడు..ఏస్‌అర్ కన్స్‌ట్రక్షన్ అధినేత సంజీవ రెడ్డి.. అక్రమ నిర్మాణ దారులు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడిన అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకుండా ప్రేక్షక పాత్ర వహించడంతో అక్రమ నిర్మాణ దారులు యదేచ్ఛగా నిర్మాణ పనులు చేస్తూ.. కోట్లు కొల్లగొట్టి అమాయక ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు అంటూ ఈ ప్రాంతంలో బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి..నిద్రపోతున్న అధికారుల దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లినా తూ తూ మంత్రంగా కేసులు నమోదు చేసి, చేతులు దులుపుకొని నిర్మాణాలను కట్టడి చేయకుండా ఉండటం అధికారుల అవినీతికి అద్దం పడుతుంది..
నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ.. యదేచ్చగా నిర్మాణ పనులు చేస్తున్నా, జిల్లా కలెక్టర్ కు లేఖ రాసినా నేటి వరకు ఎలాంటి చర్యలు అమలు కాక పోవడంతో.. కలెక్టర్ వ్యవహార తీరుపై మండి పడుతున్నారు స్థానిక ప్రజలు.. ఎన్ జి టి ఆదేశాలు అంటే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు పట్టింపు లేదా అంటూ.. ప్రశ్నిస్తున్నారు పలువురు సామాజిక వేత్తలు.. గత ప్రభుత్వంలో బరి తెగించిన హెచ్.ఎం. డి.ఏ అధికారి యాదగిరి రావు అవినీతి, అక్రమాలే తన విధులు అన్న చందాన.. హెచ్.ఎం.డి.ఏ లో ఎలాంటి ఎన్ ఓ సి లేకుండా దొడ్డిదారిన నిర్మాణ అనుమతులు ఇచ్చి జేబులు నింపుకున్నాడు అన్నది అక్షర సత్యం.. ఇందులో ఎలాంటి సందేహం లేదు.. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడుతుందని అనుకంటే.. ఈ ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్ పట్టించుకోక పోవ డం.. ఇరిగేషన్ డి.ఈ , ఏ.ఈ, ఈ.ఈ. లు సైతం మౌనంగా ఉండటం అధికారులు ఏ మేరకు అక్రమ నిర్మాణాలను ప్రత్సాహిస్తున్నారో చూడండి.. అంటూ అధికారుల వ్యవహార తీరుపై బహి రంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చి ఈ ప్రభు త్వంలో ప్రజా పాలన జరుగుతుందని నిరూపించే విధంగా.. చర్యలు అమలు అయ్యేట్లు ఇరిగేషన్ శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతికి ఆదేశాలు జారీ చేయా లని.. అన్యాక్రాంతం అవుతున్న చెరువులను పరిరక్షించే విధంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థా నం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని.. స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.. అమీన్ పూర్ చెరువు కబ్జాల వ్యవహారంపై.. ఏస్.ఆర్ కన్స్ ట్రక్షన్ యజమాని అక్రమ నిర్మాణాలకు సంబంధించి మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది.. ‘ఆదాబ్ హైదరాబాద్’.. ‘మా అక్షరం అవినీతి పై అస్త్రం’…