Tuesday, June 25, 2024

17న పాలిసెట్‌ పరీక్ష

తప్పక చదవండి
  • నిముషం ఆలస్యమైనా అనుమతి లేదు

హైదరాబాద్‌ (ఆదాబ్ హైదరాబాద్) : రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే పాలిసెట్‌ ప్రవేశ పరీక్షకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 17వ తేదీనబుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ డిప్లామా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లామా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 296 పరీక్షా కేంద్రాల్లో ఎంట్రెన్స్‌ టెస్టు నిర్వహించనున్నారు. అబ్బాయిలు 58,468 మంది, అమ్మాయిలు 47,188 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 1,05,656 మంది ఈ పరీక్షకు హాజరు కానున్నారు. పాలిసెట్‌ ఎంట్రెన్స్‌ టెస్టుకు హాజరయ్యే విద్యార్థులు ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ వెంట హెచ్‌బీ బ్లాక్‌ పెన్సిల్‌, ఏరేసర్‌, బ్లూ లేదా బ్లాక్‌ పెన్‌ తీసుకోని రావాలని సూచించారు. హాల్‌ టికెట్‌ మీద ఫోటో ప్రింట్‌ కాని వారు ఒక పాస్‌పోర్టు సైజు ఫోటోను వెంట తెచ్చుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్స్‌, ఇతర ఎలక్ట్రానిక్స్‌ వస్తువులకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు