Saturday, June 10, 2023

నన్ను జైల్లో ఉంచాలని ప్లాన్

తప్పక చదవండి
  • జైల్లో ఉన్నప్పుడు తన భార్యను అరెస్ట్ చేసి అవమానించారన్న ఇమ్రాన్
  • సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వ్యాఖ్య
  • తనను మళ్లీ అరెస్ట్ చేస్తే వారు బయటకు రాకూడదన్నదే వాళ్ల ప్లాన్ అన్న ఇమ్రాన్

లాహోర్ : దేశద్రోహ నేరం కింద పదేళ్లపాటు తనను జైల్లో ఉంచాలని పాకిస్తాన్ ఆర్మీ యోచిస్తోందని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం ఆరోపించారు. సోమవారం తెల్లవారుజామున సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్లు చేశారు. లండన్ ప్లాన్ బహిర్గతమైందని, తన చివరి రక్తపు బొట్టు వరకు వంచకులకు వ్యతిరేకంగా పోరాడుతానని చెప్పారు. తాను జైలులో ఉన్నప్పుడు హింసను సాకుగా చూపి, వారు న్యాయమూర్తి, జ్యూరీ, ఎగ్జిక్యూషనర్ పాత్రలను పోషించారన్నారు. తన భార్య బుష్రాని జైలులో పెట్టడం ద్వారా తనను అవమానపరిచే ప్రయత్నం చేశారన్నారు. పదేళ్లపాటు తనను జైలు లోపల ఉంచేందుకు కొన్ని దేశద్రోహ చట్టాలను ప్రయోగించే ప్లాన్ ఉందన్నారు. తనకు మద్దతుగా నిరసనలు తెలిపే వారిని అణచివేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. తమ పార్టీ కార్యకర్తలతో పాటు సామాన్యులను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు మీడియాను నియంత్రిస్తున్నారన్నారు. ఎందుకంటే రేపు తనను మళ్లీ అరెస్ట్ చేసినప్పుడు వారు బయటకు రాకూడదని భావిస్తున్నారన్నారు. అవసరమైతే ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తారన్నారు. అయితే, తన చివరి రక్తపు బొట్టు వరకు స్వేచ్ఛ కోసం పోరాడుతానన్నారు.

- Advertisement -
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -spot_img

మరిన్ని వార్తలు

- Advertisement -spot_img