- నివాళులర్పించిన సోనియా గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే తదితరులు..
- ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహానేత..
- తల్లి ఇందిరా గాంధీ వాససత్వాన్ని పుణికిపుచ్చుకున్న మహనీయుడు..
- రాజీవ్ జ్ఞాపకం ఎల్లప్పటికీ నిలిచే ఉంటుందన్న సోనియా గాంధీ..
న్యూ ఢిల్లీ: తన భర్త రాజీవ్ గాంధీకి ఢిల్లీలో ఆదివారం ఘనంగా నివాళులు అర్పించారు సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ. రాజీవ్ 79వ జయంతి నాడు ఆయన తనయుడు రాహుల్ గాంధీ లడఖ్ లో తన తండ్రి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ తల్లి దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ.
ఆమె సిక్కు బాడీ గార్డుల కాల్పుల్లో మృతి చెందారు. ఇక రాజీవ్ మరణం బాధాకరం. తమిళనాడులో దారుణ హత్యకు గురయ్యారు. ఆయనను ఎల్టీటీఈ పొట్టన పెట్టుకుంది. ఇవాళ ఆయన జయంతి కావడంతో పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నారు. రాజీవ్ గాంధీ తన తాత నెహ్రూ, తల్లి ఇందిరా గాంధీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. ఈ దేశానికి టెక్నాలజీ , టెలికాం అవసరమని గుర్తించారు. టెలికాం విప్లవానికి ఆద్యుడు ఆయనే. ఆనాడే టెక్నాలజీ ప్రాధాన్యతను ఎరిగిన మహా నాయకుడు.
1984 నుంచి 1989 వరకు భారత దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మే 21, 1991న రాజీవ్ గాంధీని ఈ దేశం కోల్పోయింది. ఆయన అందించిన వారసత్వాన్ని తనయుడు రాహుల్ గాంధీ అందిపుచ్చుకున్నారు. ఇటీవలే భారత్ జోడో యాత్రను చేపట్టారు. జనం కోసం తాను ఉన్నానంటూ స్పష్టం చేశారు. ఈ సందర్బంగా సోనియా గాంధీ నివాళులు అర్పిస్తూ ..రాజీవ్ నీ జ్ఞాపకం ఎల్లప్పటికీ నిలిచే ఉంటుందని పేర్కొన్నారు.